అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్రికెటర్.. నెట్టింట నవ్వులే నవ్వులు!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపు తున్నారు.

తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసి నెటిజెన్స్ పగలబడి నవ్వుతున్నారు.

సాధారణంగా మనకు సినీ సెలెబ్రిటీలు అన్నా లేదంటే క్రికెటర్స్ అన్నా చాలా క్రేజ్.ఎంత అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

Advertisement
England Spinner Jack Leach Signs Autograph On Fan Bald Head Funny Video Goes Vir

వారు ఎక్కడ కనపడిన సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఎగబడి మరి తీసుకుంటాం.వాళ్ళను బయట ఎక్కడ కనపడిన ప్రశాంతంగా అయితే ఉండనీయం.

కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోనిదే తృప్తి ఉండదు.అంతగా వారిని అభిమానిస్తూ ఉంటాం.

తమ ఫేవరేట్ క్రికెటర్స్ నుండి అయితే ఎక్కువుగా ఆటోగ్రాఫ్ తీసుకోవడానికే అభిమానులు ఇష్ట పడుతూ ఉంటారు.కొంతమంది తమ అభిమాన తారల కోసం, క్రికెటర్స్ కోసం ఆటోగ్రాఫ్ పెట్టించుకునేందుకు ఏకంగా ఒక బుక్ నే మైంటైన్ చేస్తూ ఉంటారు.

ఇంకా క్రికెటర్ల అభిమానులు అయితే బ్యాట్ కానీ, బాల్ కానీ క్యాప్, జెర్సీ తదితర వాటి మీద ఆటోగ్రాఫ్ లు పెట్టించు కుంటారు.

England Spinner Jack Leach Signs Autograph On Fan Bald Head Funny Video Goes Vir
బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

అయితే తాజాగా ఆస్ట్రేలియా లోని సిడ్నీ మైదానంలో మాత్రం ఒక అభిమాని ఏకంగా తన బట్టతల మీద నే క్రికెటర్ తో ఆటోగ్రాఫ్ పెట్టించు కున్నాడు.దీంతో గ్యాలరీ లోని ప్రేక్షకులు ముందు ఆశ్చర్య పోయిన ఆ తర్వాత చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు.ప్రసెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతుంది.ఆట సమయంలో వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.

ఇదే సమయంలో మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఇంగ్లాండ్ స్పిన్నర్ జాకీ లీచ్ ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరగా అతడు ఆ అభిమాని బట్టతల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.ఈ ఘటనతో అందరు ఆశ్చర్య పోయారు.

ఈ ఘటన లైవ్ లో కూడా చూపించడం విశేషం.ఈ వీడియో చూస్తున్న నెటిజెన్స్ నవ్వులు చిందిస్తున్నారు.

తాజా వార్తలు