అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి జంటగా నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావె.ఈ సినిమా వీరి కెరీర్ లో సూపర్ హిట్ అయ్యింది.
సమంత ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేసింది.గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సామ్ ల జోడీ చాలా ప్రత్యేకంగా కనిపించింది.
ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచి పోయింది.ఇక వీరు సినిమాల్లో మాత్రమే కాదు.రియల్ గా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్నాళ్లకే మళ్ళీ ఈ జంట విడిపోయింది.
ఇక డైవర్స్ తర్వాత మళ్ళీ వీరు ఎదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు.ఇక కలిసి నటించడం అంటే కల అనే చెప్పాలి.
ప్రెజెంట్ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.వరుస సినిమాలు చేస్తూ సామ్, చైతూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే గౌతమ్ మీనన్ మాత్రం ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట.ఆ సినిమాను చేయాలని చైతూతో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.మరి ఈ సినిమా సీక్వెల్ చేస్తే ఈ జంట మళ్ళీ కలిసి నటించాల్సి వస్తుంది.
కానీ అది జరగదు.

దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.
నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.







