ప్రస్తుతం బీజేపీ ( BJP party )అనుసరిస్తున్న వ్యూహాలు ప్రణాళికలు ఎవరికి అంతుచిక్కడం లేదు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో చాలానే మార్పులు కనిపిస్తున్నాయి.
గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని ప్రక్షాళన చేస్తూ వ్యూహాలను అమలు చేస్తోంది బీజేపీ అధినాయకత్వం.అందులో భాగంగానే ఆ మద్య కొన్ని రాష్ట్రాలల్లో అధ్యక్ష మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఏడాది చివర్లో మరో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.కర్నాటకలో వచ్చిన ఓటమిని అధిగమిస్తూ ఈసారి ఐదు రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తోంది బీజేపీ.

ముఖ్యంగా బీజేపీ దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపైనే ఉంది.తెలంగాణలో కేసిఆర్ ( CM kcr )ను ఎలాగైనా గద్దె దించి తాము అధికారం చేపట్టాలని గట్టి పట్టుదలగా ఉంది.అందులో భాగంగానే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ తప్పించి.కిషన్ రెడ్డిని ఆ పదవిలో నియమించింది.ఇంకా ఈటెల రాజేందర్ ను ఎన్నికల కమిటీ చైర్మెన్ గా నియమించింది.అయితే తెలంగాణలో బీజేపీని బలపరిచిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఎంటనే డౌట్ చాలమందిలో వ్యక్తమైంది.
అది కూడా ఎన్నికల ముందు అధ్యక్ష మార్పు చేయడం వెనుక బీజేపీ అధిష్టానం ప్లాన్ ఎంటనేది అర్థంకాని విషయం./br>

ఇక తాజాగా బండి సంజయ్( Bandi Sanjay ) ని ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి మరోసారి అందరికీ ఆశ్చర్య పరిచింది అధిష్టానం.అయితే బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు.ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయి.మరి ఎన్నికల ముందు బండి సంజయ్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.అందుకే బండి సంజయ్ కారణంగా పార్టీకి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణకు దూరంగా జాతీయ రాజకీయాల్లో బండికి స్థానం కల్పించినట్లు విశ్లేషకుల అభిప్రాయం.మొత్తానికి బండి సంజయ్ విషయంలో బీజేపీ ప్లాన్స్ ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు.







