ఎలాన్ మస్క్ బేసిగ్గా దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి.ఆయన అక్కడే జన్మించినప్పటికీ తన తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు కనుక అతనిని కెనడియన్-అమెరికన్ అని అంటారు.1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో జన్మించాడు.మస్క్ బాల్యం అంత ఈజీగా సాగలేదు.
ఎంతో దుర్భరంగా సాగిందని చెబుతూ వుంటారు.అలాగే 1980లో మస్క్ తల్లిదండ్రులు విడిపోగా కొన్ని సంవత్సరాల తరువాత తండ్రితో కూడా మస్క్ తెగతెంపులు చేసుకున్నాడు.
మస్క్ కేవలం 12ఏళ్ల వయస్సులోనే బ్లాస్టర్ అనే వీడియోగేమ్‌ను తయారు చేసి, రికార్డ్ సృష్టించాడు.

అలాంటి మస్క్ మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచంలోనే నెంబర్ వన్ కోటీశ్వరుడిగా ఎదిగాడు.అయితే మస్క్ విలాసాలకు కూడా ఏమాత్రం తీసిపోడు.ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ కార్స్, బైక్స్, ఇంకా ఎయిర్ ప్లైన్స్, షిప్స్ అనేకం అతని దగ్గర వున్నాయి.
ఇంకా మనోడు వివాదాలకు కూడా కాస్త దగ్గరగానే ఉంటాడు.తాజాగా మరో ఘనత సాధించాడు.అత్యధిక సంపదలోనే కాకుండా, అతిపెద్ద నష్టంలోనూ రికార్డు సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు ఎలాన్ మస్క్.

2022 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా అత్యధికంగా నష్టపోయారు.ఆయన కంపెనీ టెస్లా షేరు అత్యధికంగా నష్టాలను మూటగట్టుకుంది.2021 నవంబర్ నుంచి మస్క్ దాదాపు 182 బిలియన్ డాలర్లు మేర నష్టపోయారు.అంటే ఇది ఇంచుమించు 200 బిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది.ఫోర్బ్ ప్రకారం, మస్క్ నికర విలువ 2021 సంవత్సరంలో 320 బిలియన్ డాలర్లకు పెరగ్గా, 2023 సంవత్సరం జనవరి నాటికి ఇది 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
టెస్లా స్టాక్ అధ్వాన్నమైన పనితీరు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.







