తమిళనాడులోని బందలూరులో ఏనుగుల బీభత్సం

తమిళనాడులోని నీలగిరిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి.ఈ మేరకు బందలూరు పట్టణంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.

గత నెల రోజులగా ఇక్కడే మకాం వేసిన ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే పలు పంటలతో పాటు ఆస్తులు ధ్వంసం కాగా తాజాగా రెండు ఏనుగుల దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.దీంతో అప్రమత్తమైన బందలూరు అటవీ శాఖ అధికారులు నాలుగు కుమ్మీ ఏనుగులతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే రెండు ఏనుగులను సమీపంలో అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు