వైరల్: నాతో పెట్టుకుంటే మాములుగా ఉండదు..పగలే చుక్కలు చూపిస్తా అంటున్న ఏనుగు..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.ఒక్కోసారి జంతువులు చేసే చిలిపి చేష్టలు చూస్తుంటే భలే ఫన్నీగా ఉంటాయి.

 Elephant Attack Women Viarl Video Elephant, Viral Latest, News Viral, Social Me-TeluguStop.com

వీటిని చూడటానికి నెటిజన్లు సైతం బాగా ఆసక్తి చూయిస్తున్నారు.ఒక్కోసారి పెంపుడు జంతువులు కూడా తమ యజమానుల పట్ల వింత వింతగా ప్రవర్తిస్తూ నవ్వు తెప్పిస్తాయి.

అయితే కొన్ని కొన్ని సార్లు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులే కాకుండా జూ లో పెరిగే జంతువులు కూడా చిలిపి పనులు చేస్తూ నవ్వు తెప్పిస్తాయి.తాజాగా ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

కొంతమంది పర్యటకులు జూ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే జంతువులను చూసి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు.అలాంటప్పుడు అక్కడ ఉండే జంతువులు కొన్ని కొన్ని సార్లు వారిపై దాడి చేస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఒక ఏనుగు కూడా జూ కు వచ్చిన పర్యాటకులపై దాడి చేసింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం కొందరు విద్యార్థులు జూ లోని జంతువులను సందర్శించడానికి ఒక ఏనుగు దగ్గరకు వచ్చాసెల్ఫీ దిగాలని ప్రయత్నం చేసారు.ఈ క్రమంలోనే కాసేపు దాని తొండాన్ని ప్రేమతో నిమిరారు.అది కూడా ముందు వాళ్ళను ఏమి అనకుండా చెవులను ఊపుతూ వారివంక చూస్తుంది.

ఇంతలో ఒక యువతి ఏనుగుతో ఫోటో తీసుకుందాం అని దాని దగ్గరకు వెళ్లింది.దాన్ని ఫోటోతీయడానికి తెగ ప్రయత్నం చేసింది.ఆ యువతీ తనని ఏదో చేస్తుందని భావించిన ఏనుగు కోపంతో తన తొండంతో ఆ యువతీని కొట్టింది.ఏనుగు తొండం దెబ్బకు ఆ యువతి చేతిలోని ఫోన్ కాస్త ఎగిరి కిందపడింది.

ఊహించని ఆ ఘటనతో ఆ యువతి పాపం భయంతో దూరంగా పారిపోయింది.ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో నవ్వుల వర్షం కురిపిస్తుంది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏనుగుతో పెట్టుకుంటే అట్లుంటది మరి అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube