తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసే బీఆర్ఎస్ సభపై ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కొన్ని పార్టీలు కావాలనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో విమర్శలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.







