వింటుంటేనే రోత పుడుతోంది కదూ.ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు ఎక్కడున్నాయి? ఎవరు తింటారు? అనే అనుమానం కలుగుతోంది కదూ.ప్రతి రోజు ఒక కోడి గుడ్డును( Eggs ) ఉడకబెట్టుకొని తినాలని వైద్యులు చెబుతుంటారు.ఎందుకంటే గుడ్డులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తాయి.
ఈ క్రమంలో సాధారణంగా అందరూ గుడ్లను నీటిలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తారు.అలాగే గుడ్డు చెదిరిపోకుండా పొట్టు రావాలని కొంచెం నూనె వేస్తారు.కానీ, చైనాలో( China ) మాత్రం చిన్న పిల్లల మూత్రంలో గుడ్లను ఉడకబెట్టి ఇష్టంగా రోజుకు ఒకటి తింటారనే విషయం గురించి ఎపుడైనా విన్నారా?

అవును, ఇది నిజం.అక్కడ వారి దైనందిత జీవితంలో ఇది చాలా సర్వసాధారణం అని చెబుతున్నారు.దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడం కొసమెరుపు.వివరాల్లోకి వెళితే, డోంగ్యాంగ్ ప్రాతంలో స్కూల్స్‌లో వ్యాపారస్తుల ముందుగానే పెద్ద పెద్ద పాత్రలను స్కూల్ మూత్ర శాలలో ఉంచుతారు.
అందులో 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు వెళ్లి మూత్రం(
Urine ) పోస్తారు.అక్కడకు వ్యాపారస్తులు బకెట్లు, డ్రమ్ములు వంటి పెద్ద పెద్ద పాత్రలను పట్టుకుని క్యూ కడతారట.

తరువాత ఆ పాత్రల్లో వ్యాపారస్తులు యూరిన్‌ను సేకరిస్తారు.ఆ సేకరించిన యూరిన్‌లో గుడ్లను ఒకరోజంతా నానబెట్టి గుడ్డు పెంకు పగిలే వరకు ఉడికించి ఆ తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు.మూత్రంలోని ఉప్పు గుడ్డు లోపలికి వెళ్లి రుచికరంగా మారి మంచి సువాసనను కూడా ఇస్తుందని అంటున్నారు.చైనా ప్రజలు ఎంతో చాలా టేస్టీగా ఉన్నాయని లొట్టలేసుకుని మరీ కుటుంబమంతా తింటారట.
కొన్నేళ్ల నుంచి వీటిని తినడం వారికి అలవాటు అయిపోయిందట.అంతేకాకుండా ఈ గుడ్లను తినడం వల్ల శరీరంలో వేడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని వారు చెబుతున్నారు.
ఒకసారి ట్రై చేస్తారేమిటి?