కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు తిన‌కూడ‌ద‌ట‌..ఎందుకంటే?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మందికి పెరుగు లేనిదే రోజు కూడా గ‌డ‌వ‌దు.అంత‌లా పెరుగుకు ఎడిక్ట్ అయ్యారు.

పెరుగు తిన‌డానికి రుచిగా ఉంటుంది.అలాగే ప్రోటీన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌, విట‌మిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లను సైతం క‌లిగి ఉంటుంది.

అందుకే ఆరోగ్యానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది.బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అయితే పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం తిన కూడ‌ద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement
Effects Of Curd For Knee Pain Patients! Effects Of Curd, Curd, Latest News, Knee

అదేంటి, కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు ఎందుకు తిన‌కూడ‌దు.? అనేగా మీ సందేహం.అక్క‌డికే వ‌స్తున్నా.

కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు పెరుగును రోజూ తీసుకుంటే నొప్పులు మ‌రింత తీవ్ర త‌రంగా మార‌తాయి.అందులోనూ ఫ్రిజ్‌లో ఉండే పెరుగు, పుల్ల‌టి పెరుగు తీసుకుంటే కీళ్ల నొప్పులు బాగా పెరిగి పోతాయి.

Effects Of Curd For Knee Pain Patients Effects Of Curd, Curd, Latest News, Knee

ఒక వేళ ఖ‌చ్చితంగా తీసుకోవాలి అనుకుంటే పెరుగుకు బ‌దులుగా మ‌జ్జిగ తాగితే మంచిద‌ని చెబుతున్నారు.మ‌జ్జిగ‌లో కొద్దిగా ప‌టిక బెల్లం క‌లిపి తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

అంతేకాదు, జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగు ప‌డి.గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అలాగే పెరుగుకు బ‌దులుగా మ‌జ్జిగ తీసుకుంటే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.నీర‌సం, అల‌స‌ట‌, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డొచ్చు.

Advertisement

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.ఊబకాయంతో బాధ ప‌డే వారు కూడా ఎప్పుడూ పెరుగు కాకుండా మ‌జ్జిగే తీసుకోవాలి.

త‌ద్వారా ఊబకాయ సమస్య నుండి విముక్తి పొంద వచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు