ముఖంపై అవాంఛిత రోమాలను క్ష‌ణాల్లో తొల‌గించే సూప‌ర్ మాస్క్ ఇదే!

ముఖంపై అవాంఛిత రోమాలు చూసేందుకు అస‌హ్యంగా క‌నిపించ‌డ‌మే కాదు.చ‌ర్మ కాంతిని కూడా త‌గ్గించేస్తాయి.

అందుకే ఫేషియల్ హెయిర్ ను రీమూవ్ చేయించుకోవ‌డం కోసం త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్తుంటారు.అయితే ఇంట్లో కూడా ముఖంపై అవాంఛిత రోమాలను తొల‌గించుకోవ‌చ్చు.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఫేస్ మాస్క్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ సూప‌ర్ మాస్క్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో వ‌న్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడ‌ర్ వేసి మ‌ళ్లీ క‌లుపుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాట‌ర్ పోయాలి.వాట‌ర్ బాగా మ‌రిగిన వెంట‌నే.

Advertisement

అన్ని ప‌దార్థాలు క‌లిపి పెట్టుకున్న గిన్నెను పెట్టి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి.

హీట్ చేసిన మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకుని.ఆపై ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరినిచ్చి.

అప్పుడు మాస్క్‌ను మృదువుగా తొలగించాలి.ఆ వెంట‌నే వాట‌ర్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకుని రెండు ఐస్‌ క్యూబ్స్‌తో రుద్దాలి.

ఇప్పుడు త‌డి లేకుండా ట‌వ‌ల్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాయాలి.ఇలా చేస్తే ముఖంపై వ‌చ్చిన అవాంఛిత రోమాలు తొల‌గి పోవ‌డ‌మే కాదు.

Validation Check 2026
జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

మురికి, మృత‌క‌ణాలు సైతం పోయి స్కిన్ మృదువుగా, కాంతి వంతంగా మారుతుంది.అలాగే కొంద‌రు ఆయిలీ స్కిన్‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతుంటారు.

Advertisement

అలాంటి వారు పైన చెప్పిన మాస్క్‌ను వేసుకుంటే ఆయిలీ స్కిన్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందొచ్చు.