తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికల వస్తూ ఉండటంతో ఇప్పటికే.
రెండుసార్లు టిఆర్ఎస్ గెలవడంతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని.చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకుంటూ ఉంది.
ఈ క్రమంలో ఎక్కువగా బీజేపీ పార్టీని టిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుండి పోటీ చేస్తానని కేసిఆర్ తో పోటీ పడతానని పేర్కొన్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు ఓడించిన రీతిలో… కేసిఆర్ నీ ఓడిస్తానని చెప్పుకొచ్చారు.ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.
ఈ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గం అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని.కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుస్తాను అని ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అప్పట్లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓడిన సీన్ రిపీట్ చేస్తానని తనదైన శైలిలో ఈటెల వ్యాఖ్యలు చేశారు.