పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించారు.ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఆయన విడుదల చేశారు.
ఈ మేరకు పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్ల ఆర్థిక సాయం చేశామన్నారు.జగనన్న విద్యాదీవెన కింద 27.61 లక్షల మంది పిల్లలకు స్కూల్ ఫీజులు అందించామని పేర్కొన్నారు.జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు ఖర్చు చేశామన్న సీఎం జగన్ వసతి దీవెన కింద మరో రూ.4,275 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.దేశ భవిష్యత్ ను మార్చే శక్తి చదువుకే ఉందని స్పష్టం చేశారు.