టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. రకుల్, రానా,రవితేజ, చార్మి, పూరీ సహా మొత్తం 12 మందికి నోటీసులు జారీ..!

నాలుగేళ్ల క్రితం(2017 జూలై లో) నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

  ప్రముఖ నటి రకుల్ ప్రీతిసింగ్, చార్మి, నటులు రానా దగ్గుబాటి, రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ సహా 12 మంది సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) ప్రశ్నించింది.

డ్రగ్స్ క్రయ విక్రయాలు భారీగా మనీలాండరింగ్ జరిగిందని సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగింది.ఎక్సైజ్ శాఖ నుంచి వివరాలు సేకరించి సినీ ప్రముఖులు సహా మొత్తం 12 మందికి బుధవారం నోటీసులు జారీ చేసింది.

వీరిలో సినీ నటులు రకుల్, రానా, రవితేజ, పూరితో పాటు ఛార్మికౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనిష్, తరుణ్, నందు ఉన్నారు.మిగతా ఇద్దరిలో ఒకరు రవితేజ కార్ డ్రైవర్ శ్రీనివాస్, మరోకరు ఎఫ్- క్లబ్ పబ్ జనరల్ మేనేజర్.

ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 22 వరకు నోటీసులో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.అయితే ఈ కేసులో రకుల్, రానా, రవితేజ, పూరీ నిందితులుగా చేర్చలేదని, మనీ లాండరింగ్ లో వీరి ప్రమేయం ఉందని చెప్పడం తొందరపాటు అవుతుందని ఈడీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement

ఒక్కొక్కరు ఒక్కో తేదీన హాజరు కావాలని తెలిపారు.ఆగస్టు 30న పూరి సెప్టెంబర్, 2న చార్మి, 8న రానా, 9న రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, 13 నవదీప్, ఎఫ్- క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 15 ముమైత్ ఖాన్ పేర్కొంది.ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని దర్యాప్తు చేస్తుంది కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది ఈ సమయంలో ఈ రంగంలోకి దిగడంతో చర్చనీయాంశంగా మారింది.

 .

Advertisement

తాజా వార్తలు