ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.నోటీసులకు హాజరుకాకపోవడంతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై ఈడీ ( Ed )కేసు నమోదు చేసింది.
అంతేకాకుండా కేజ్రీవాల్ విషయంలో ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈడీ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఇటీవలే ఆరోసారి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.







