మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారాయి.నేడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.భారీ పకడ్భందీ మధ్య పోలింగ్ జరుగుతున్నాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,855 మంది ఓటర్లు ఉండగా.వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.అలాగే 1,000 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.298 పోలింగ్ కేంద్రాలను కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్.మునుగోడు ఉప ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.మొట్టమొదటి సారిగా మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.అయితే ఈ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే స్టాఫ్ కూడా మహిళలే ఉంటారు.
దివ్యాంగులు, వృద్ధుల కోసం సపరేట్‌గా వాలంటీర్లను నియమించారు. ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్ సమత ముళ్లపూడి నారాయణపూర్‌లో ఏర్పాటు చేసిన సఖీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
తొలి ఓటు వినియోగించుకున్న మహిళకు ఆయన అభినందనలు తెలియజేశారు.

బరిలో 47 మంది అభ్యర్థులు.మునుగోడు ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి.బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది.ఎలాగైన ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పోటీ పడుతున్నారు.
కాగా, మునుగోడుతో సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ, ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.