నిద్ర రావట్లేదా? అయితే ఈ పండు తినాల్సిందే.!

ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో రాత్రులు కనీసం ఐదారు గంటలు కూడా నిద్రపోవడం లేదు.సరైన సమయానికి తిండి కూడా తెలియడం లేదు.

అయితే కొందరికి రాత్రులు పడుకోగానే నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.దీని వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అందుకోసమే కడుపునిండా తినడం వల్ల కంటి నిండా నిద్ర పోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.ఇటీవల తేలిన విషయం ఏమిటంటే ఓ పండు తింటే రాత్రులు తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆ పండు ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం! నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజుకు రెండు కివి పండ్లను తినడం ద్వారా నిద్రకు కొదవే ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు.కివిలో ఉండే సెరోటిన్ నిద్రలేమి సమస్య నుంచి కాపాడుతుందట.

Advertisement
Health Benefits Of Eating Kiwi Fruit, Weight Loss, Improves Digestion, BP, Sodiu

కివి దీనిని "వండర్ ఫ్రూట్ "అని కూడా అంటారు.దాదాపు 27 రకాల పండ్లలో లభించే పోషకాలు ఒక కివిలోనే లభిస్తాయి.

నారింజ, బత్తాయి పండ్లలో కన్నా అధిక శాతం విటమిన్ సి ఈ కివి పండ్లలో లభ్యమవుతుంది.విటమిన్ సి తో పాటు విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి ఎన్నో పోషక పదార్ధాలు ఈ పండులో కలిగి ఉన్నాయ్.

Health Benefits Of Eating Kiwi Fruit, Weight Loss, Improves Digestion, Bp, Sodiu

ఇక ఈ కివి ఫ్రూట్ బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరంగా చెప్పవచ్చు.జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

ఇది రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా, రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.అంతే కాకుండా అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇందులో ఉన్న సోడియం రక్తపోటును తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.ఈ కివి రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ఈ పండును తినడం వల్ల రక్త కణాలు మెరుగ్గా అభివృద్ధి చెందుతాయి.ఇందులో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఇవి క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ను నివారిస్తుంది.ఇన్ని పోషక విలువలున్న కివి పండు ను రోజుకు రెండు తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

తాజా వార్తలు