రోజూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో 2 న‌ల్ల యాల‌కులు తింటే లెక్క‌లేన‌న్ని లాభాలు పొందొచ్చు..తెలుసా?

యాలకులు( Cardamom ). వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి.స్కీట్స్ త‌యారీలో యాల‌కుల‌ను ఖ‌చ్చితంగా వాడుతుంటారు.

చ‌క్క‌టి రుచి, సువాస‌న అందించ‌డంలో యాల‌కుల‌కు మ‌రొక‌టి సాటి లేదు.యాలకులు అంటే ఆకుపచ్చ రంగులో ఉండేవే అందరికీ గుర్తుకు వస్తాయి.

కానీ నల్ల యాలకులు కూడా ఉంటాయి.ఇవి మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Advertisement

ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో రెండు నల్ల యాలకులను( Black Cardamom ) నమిలి తింటే లెక్కలేనన్ని లాభాలు పొందొచ్చు.సాధార‌ణంగా చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారికి నల్ల యాలకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.

రోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు నల్ల యాలకులు నమిలి తినాలి.ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.

ఇలా కనుక చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.రోజు ఉదయం ఖాళీ కడుపుతో నల్ల యాలకులు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.

జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.నల్ల యాలకుల్లో ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకం సమస్య( Constipation )ను తరిమికొడుతుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

నల్ల యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.అందువల్ల వీటిని రోజు ఉదయం రెండు చొప్పున‌ నమిలి తింటే నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

Advertisement

నోటి నుంచి దుర్వాసన( Bad Smell ) రాకుండా ఉంటుంది.చిగుళ్ళ నుండి రక్తస్రావం, చిగుళ్ల వాపు, దంతాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.అంతే కాదు రోజు ఉదయం రెండు నల్ల యాలకులను తినడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.

గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్స్( Urinary Infections ) ఉంటే న‌యం అవుతాయి.

చర్మం హెల్తీగా, కాంతివంతంగా మెరుస్తుంది.మొటిమలు సమస్య సైతం తగ్గు ముఖం పడుతుంది.

కాబ‌ట్టి, ఇక‌పై న‌ల్ల యాల‌కులు క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌వ‌ద్దు.

తాజా వార్తలు