సోషల్ మీడియాలో( Social Media ) అనునిత్యం యేదో ఒక వీడియో వైరల్ అవుతూనే వుంటుంది.ఈ క్రమంలో కొన్ని రకాల వీడియోలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వుంటాయి.
ముఖ్యంగా ఈమధ్య కాలంలో గల్లీలో వున్న టాలెంట్( Talent ) కూడా బయటపడుతూ వుంది.అవును, ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది.
అది ఎప్పుడో గానీ బయటపడదు.ఆరోజు మాత్రం వారి గొప్పతనం గురించి ఈ ప్రపంచం తెలుసుకుంటుంది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో అలాంటి ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.విషయం యేమిటంటే.మనం సాధారణంగా తొమ్మిదో ఎక్కం( Ninth Table ) చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతూ వుంటాము.
అయితే ఆ వీడియో చిన్నారి ఎంతో ఈజీగా బోర్డుపైన 9వ ఎక్కం రాసేసింది.అది చూసి నెటిజన్లు అరే.ఇన్నాళ్లూ ఈ తొమ్మిదో ఎక్కం చదవడానికి ఎంత కష్టపడ్డామో… అని అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ వీడియోని ఒకసారి చూసినట్లైతే ఆ చిన్నారి క్లాస్ రూమ్‌లో( Class Room ) బోర్డుమీద తొమ్మిదవ ఎక్కం సునాయసంగా రాయడం చూడవచ్చు.అందుకు మొదట ఆ చిన్నారి బోర్డుపై 1 X 9 = అని రాసి దాని ఎదురుగా ఆన్సర్ రాయలేదు.అలా వరుసగా 9 X 9 వరకూ రాసింది.
ఆ తరువాత కూడా వాటి ముందు ఆన్సర్ రాయలేదు.తర్వాత 2 X 9 = దగ్గరనుంచి మొదలు పెట్టి 1 నుంచి 8 వరకూ నెంబర్లు వాటి ఎదురుగా రాసిన తర్వాత కిందనుంచి మళ్లీ రివర్స్‌లో 1 నుంచి 9 వరకూ నెంబర్లు రాసుకుంటూ వెళ్లింది.
కట్ చేస్తే టేబుల్ మొత్తం కరెక్టుగా వచ్చేసింది.ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.