ఢిల్లీ లో భూకంపం..ఇళ్లల్లో నుండి జనాలు పరుగులు..!!

దేశంలో ఉత్తరభారతంలో గత కొంత కాలం నుండి భూప్రకంపనలు వణికిస్తున్న సంగతి తెలిసిందే.

నాలుగు రోజుల క్రితమే పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భూకంపాలు చోటుచేసుకోవడం జరిగాయి.

ఇదిలా ఉంటే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా భూకంపం సంభవించడం జరిగింది.దీంతో ఢిల్లీలో ప్రజలు ఇళ్లల్లో నుండి భయాందోళనతో బయటకు పారి పోవడం జరిగింది.

ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో నోయిడా గురుగ్రామ్ ఘజియాబాద్ అంతటా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిన వీడియోలు బయటకు వచ్చాయి.భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పైన 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.దేశంలో పంజాబ్ లో అమృత్ సర్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది.

అదే రీతిలో భూకంప కేంద్రం తజకిస్తాన్ లో కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది.ఆ ప్రాంతంలో   6.3 తీవ్రతతో భూమి కంపించడం జరిగింది .దాదాపు భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో.ఈ రీతిలో భూప్రకంపనలు గత కొన్ని రోజుల నుండి సంభవిస్తున్నట్లు శాస్రవేత్తలు తెలుపుతున్నారు.

Advertisement

 .

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు