ఒక పక్క కరోనా మరో పక్క భూకంపం...అల్లాడుతున్న అమెరికా...!!!

అమెరికా కరోనా తో అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి దెబ్బకి అమెరికా ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు.

ప్రపంచంలో కరోన బాధిత దేశాలలో అమెరికా రెండవ స్థానంలో ఉండటం ఆ దేశాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది.అందుకు తగ్గట్టుగా ఆ దేశాధినేతలు అమెరికాలో సుమారు మరణాల సంఖ్య లక్షకి పైగా చరుకుంటుందని వార్తలు రావడంతో మరింత ఆందోళన కరమణ పరిస్థితులు నెలకొన్నాయి.

రోజు వ్యవధిలో వందల మరణాలు ఆదేశాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నేట్టేస్తున్నాయి.ఇదిలాఉంటే.

ఒక పక్క కరోనా అమెరికాలో విలయం సృష్టిస్తుంటే మరో పక్క తాజాగా జరిగిన భూకంప ఘటన భయభ్రాంతులకి గురిచేసింది.అమెరికా రాష్ట్రం ఇదాహో లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.ఈ సందర్భంలో నేషనల్ వెదర్ సర్వీస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా బలమైన భూకంపం సంభవించిందని , గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం జరిగిందని పేర్కొంది.సుమారు 20-30 సెకన్ల పాటు తీవ్రంగా భూమి కంపించడంతో ఒక్క సారిగా ఇళ్ళల్లో ఉన్న ప్రజలు బయటకి పెరుగులు తీశారు.అయితే

ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర గవర్నర్ అమెరికాని ఇప్పటికే కరోనా కాటేసిందని,.ఈ ప్రభావంతో ఇప్పటి వరకూ వేలాది మంది మృతి చెందారని, లక్షలాది మందికి కరోనా సోకి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నారని.ఈ క్రమంలోనే భూకంపం రావడం అమెరికా ప్రజలకి మరింత ఆందోళన కలిగించిందని అన్నారు.

ఈ భూకంప ప్రభావాని అంచనా వేస్తున్నామని ప్రకటించారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు