మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడికి ప్రయత్నం జరిగింది.నాంపల్లిలో ఆమె కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడేందుకు యత్నించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.ఇరు వర్గాలు గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అనంతరం ఈ ఘటనపై పాల్వాయి స్రవంతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.దాడికి ప్రయత్నించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.