కేబుల్ బ్రిడ్జి తలనొప్పి!

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు, దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కొన్ని వేల కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చిన KTR, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా దుర్గం చెరువు కేబుల్ వంతెన ను నిర్మించడం జరిగింది,ఈ వంతెన భారతదేశంలో అతి పెద్ద కేబుల్ వంతెన గా చరిత్రలో నిలిచిపోనుంది.

ఈ వంతెన అందాలను చూడడానికి ప్రజలు కోవిడ్ ను సైతం లెక్క చేయకుండా అసలు కరోనా అంటే మాకు తెలీదు అనే తరహాలో తండోప తండాలుగా వస్తున్నారు.ఒక పక్క పార్కింగ్ సమస్య తో పోలీసులు బాధపడుతుంటే మరోపక్క వేగంగా వస్తున్న వాహనాలను సైతం లెక్క చేయకుండా రోడ్ పై సెల్ఫీ లు దిగుతూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు, దీనితో హైదరాబాద్ ప్రజలు పోలీసులకు తలకు మించిన భారంగా తయారయ్యారు.

Durgam Cheruvu Cable Brudge Hyderabad, Durgam Cheruvu, Cable Bridge, KTR, India

ఇపుడు ఈ సమస్యల వల్ల ఈ వంతెన మరికొద్ది రోజులు మూతపడేలా ఉంది.ఏదైతేనేం హైదరాబాద్ అందాలను మరింత పెంచింది ఈ కేబుల్ వంతెన.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు