ఇండస్ట్రీలో రాణించడానికి టాలెంట్ ఉంటే చాలు.ఒక్కసారి క్లిక్ అయితే దశ తిరిగినట్టే.
మరి ఈ మధ్య మన టాలీవుడ్ లో చాలా మంది యంగ్ బ్యాచ్ పరిచయం అయ్యారు.తాజాగా మన టాలీవుడ్ లోకి మరో యంగ్ హీరో తన అదృష్టం పరీక్షించు కోవడానికి రాబోతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నర్నె నితిన్( Narne Nithin ) హీరోగా పరిచయం అవ్వబోతున్నారు.
ఈ యంగ్ హీరో నటిస్తున్న మొట్టమొదటి మూవీ ”మ్యాడ్”.
( Mad Movie ) ఈ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా యూత్ ఫుల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి ఫన్ అండ్ హిలేరియస్ టాక్ అందుకుంది.ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టు కోవడంతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ చిత్రం ఈ వీకెండ్ లో అక్టోబర్ 6న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేసారు.ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.మరి ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్,( Dulquer Salmaan ) మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హాజరవ్వబోతున్నారు.
భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించిన మ్యాడ్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.







