పూటుగా మద్యం తాగి మహిళను బురదలోకి తోశాడు.. లక్షల విలువైన కెమెరా నాశనం..

ఈ ప్రపంచంలో అనవసరంగా ఇతరులకు హాని తలపెట్టే తీటగాళ్ళు ఎందరో ఉన్నారు.ఇలాంటి వారికి తగిన శాస్తి చేస్తే గానీ బుద్ధి మారదు.

 Drunk Guy Pushes Woman Into A Pond Destroying Her Expensive Camera Video Viral D-TeluguStop.com

అని చాలా సందర్భాల్లో వీరు పిచ్చి చేష్టలు చేసి ఎలాంటి శిక్ష పడకుండా తప్పించుకుంటుంటారు.వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) కూడా అడపా దడపా వైరల్ అవుతుంటాయి.

ఆ వీడియోలు చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.తాజాగా ఈ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

@సీసీటీవీ వీడియోస్ అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే రెండు లక్షల దాకా వ్యూస్, వెయ్యి దాకా లైక్స్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో బనీన్ ధరించే ఉన్న ఒక తాగుబోతు( Drunkard ) కనిపించడం మనం చూడవచ్చు.అతడు కెమెరాకు థమ్సప్ సైన్ చేశాడు.అనంతరం నవ్వుకుంటూ వెళ్లి చెరువు పైన వ్యూస్ క్యాప్చర్ చేస్తున్న మహిళను బురద నీటిలోకి తోసేసాడు.దాంతో ఆమె విలువైన కెమెరాతో( Expensive Camera ) సహా అందులో పడిపోయింది.

ఆపై కాస్త కష్టంగా లేచి అతడి వద్దకు వచ్చి నిలదీయడం మొదలుపెట్టింది.ఈ కెమెరా విలువ మూడు వేల పౌండ్లు (దాదాపు రూ.3 లక్షల 14 వేలు) అని చెప్పడం కూడా మనం వీడియోలో వినవచ్చు.అక్కడే కొంతమంది కూడా ఉన్నారు.

వారు ఆ కెమెరా వుమెన్‌కు సపోర్ట్ గా మాట్లాడుతూ పోలీసులకి ఫోన్ చేయాలని అరిచారు.అయితే ఆ తీవ్రమైన పరిస్థితిని అర్థం చేసుకున్న తాగుబోతు అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు.

అయితే అతడిని పోలీసులకు పట్టించేందుకు చాలామంది కెమెరాల్లో అతడి ఫోటోలు తీసుకున్నారు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చేస్తూ మహిళను చెరువులోకి నెట్టాడు.ఖరీదైన కెమెరాను ధ్వంసం అయింది.” అని ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిని తిట్టిపోస్తున్నారు.“ఈ వ్యక్తి చాలా దురుసుగా ప్రవర్తించాడు.ఇది అసలు ఫన్నీ కాదు.” అని ఒక వ్యక్తి అన్నారు.ఈ వ్యక్తికి ఇప్పటికీ శిక్ష పడలేదని, అతడు తప్పించుకుని పోయాడు అని ఘటన గురించి తెలిసిన మరొక వ్యక్తి వెల్లడించాడు.ఆ కెమెరా, దాని లెన్సెన్స్ చాలా ఖరీదైనవని, ఆ వ్యక్తి చేసిన పని వల్ల ఆమె చాలా నష్టపోయి ఉంటుందని అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube