నీళ్లు ఎక్కువగా తాగితే ఆ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?

మనలో చాలామందికి నీళ్లు తాగే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి.

కొందరు తక్కువగా నీళ్లు తాగితే మంచిదని చెబితే మరి కొందరు ఎక్కువగా నీళ్లు తాగితే మంచిదని చెబుతూ ఉంటారు.

అయితే వైద్య నిపుణులు మాత్రం నీళ్లు తక్కువగా తాగినా, నీళ్లు ఎక్కువగా తాగినా ప్రమాదమేనని చెబుతున్నారు.సాధారణంగా ఒక మనిషి నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.

ఆటగాళ్లు, కొరియోగ్రాఫర్లు, ఎండలో ఎక్కువ సమయం శ్రమించే వాళ్లు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి.దాహం అయిన ప్రతిసారి నీళ్లను తాగాలి.

అలా కాకుండా అదేపనిగా నీళ్లను తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.ఎక్కువగా నీళ్లను తాగితే సాధారణంగా కంటే కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని.

Advertisement

కిడ్నీల పనితీరు దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.శరీరంలో నీరు ఎక్కువ మొత్తంలో చేరితే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పుతుందని చెబుతున్నారు.

సాధారణంగా నీళ్లు తాగేవాళ్లను, ఎక్కువగా నీళ్లు తాగేవాళ్లను పోల్చి చూసినప్పుడు ఎక్కువగా నీళ్లు తాగేవాళ్లలో

గుండెపై ఎక్కువగా భారం

పడుతుందని, రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని తెలుపుతున్నారు.అవసరానికి మించి నీరు తాగితే ఆరోగ్య సమస్యల బారిన పడక తప్పదని తెలుపుతున్నారు.

నీళ్లు తాగే విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.ఎక్కువ నీళ్లు తాగేవాళ్లలో మెదడులో ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఏర్పడుతున్నాయని అలాంటి వాళ్లలో సోడియం ప్రమాణాలు తగ్గిపోతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

మరీ అధికంగా నీళ్లు తాగితే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలుపుతున్నారు.ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని ప్రచారం జరుగుతోందని కానీ ఆ ప్రచారం నిజం కాదని తగినంత నీరు మాత్రమే తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు