జనసేనుడి నిరాహారదీక్షలో అనుమానాలేన్నో..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష చేపట్టారు.అయితే ఆ నిరాహారదీక్ష చాలా సీక్రెట్ గా చేస్తున్నారంట.

 Doubts On Pawan Kalyan Hunger Strike-TeluguStop.com

పవన్ ప్రస్తుతం ఓ రిసార్ట్ లో ఉంటున్నారు.అక్కడే ఈ దీక్ష చేస్తున్నాడు.

అయితే ఆయన చేస్తున్న దీక్ష ఎవరికీ కనిపించదు.కనీసం మీడియా కి కూడా అనుమతి లేదు.

కేవలం జనసేన కు సంబంధించిన కొంతమంది మాత్రమే ప్రెస్ కి ఫోటోలు , వీడియో లు అందిస్తారంట.ఇదంతా పెద్ద గమ్మత్తు వ్యవహారంగానే కనిపిస్తోందని మీడియా ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.అందులో భాగంగా … మూడు రోజుల కిందట… పలాసలో కిడ్నీ రోగులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.వారిని ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు.రెండు రోజుల్లో ఆరోగ్యమంత్రిని నియమించి… బాధితులకు సాయం కనుక అందించకపోతే .తాను ఇక్కడి నుంచే నిరాహార దీక్ష చేస్తాను అని పవన్ని ప్రకటించేశాడు.ప్రభుత్వానికి 48 గంటల సమయం కూడా ఇచ్చాడు.

అయితే పవన్ ఇలాగే వాగుతాడులే అనుకుందో ఏమో కానీ ప్రభుత్వం పెద్దగా పవన్ వ్యాఖ్యలను పట్టించుకోలేదు.దీంతో పవన్ 24 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించాడు.

ప్రస్తుతం టెక్కలి సమీపంలో ఉన్న దాట్ల రిసార్ట్స్ లో పవన్ బస చేశారు.శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన అందులోనే నిరాహారదీక్ష చేస్తారని జనసేన వర్గాలు ప్రకటించాయి.

ముందుగా … వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేరన్న కారణంతో గురు,శుక్రవారాలు ఆయన యాత్రకు విరామం ఇచ్చారు.శనివారం యథావిధిగా పోరాటయాత్ర ఉంటుందని జనసేనవర్గాలు ముందుగా ప్రకటించాయి.

కానీ అనూహ్యంగా .శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచే నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో శనివారం కూడా పోరాటయాత్ర వాయిదా పడినట్లయింది.ఐదు గంటలకు నిరాహారదీక్ష ప్రారంభించినా దాట్ల రిసార్ట్స్ లోపలకు మీడియాను అనుమతించడం లేదు.జనసేన మీడియా విభాగమే ఫోటోలు, వీడియోలు పంపిస్తుందని.మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

రేపు ఉదయం తొమ్మిది గంటలకు మాత్రం.రిసార్ట్స్ బయటకు వచ్చి.కిడ్నీబాధితులు.మరికొంత మంది ప్రజల సమక్షంలో దీక్షలో కూర్చుకుంటారు.

ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్నాయి.

పవన్ డిమాండ్లకు లోకేష్ వివరణ :

కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ స్పందించారు.తాము ఏమేం చేశామో వివరిస్తూ… ట్వీట్ చేశారు.

కిడ్నీ వ్యాధులు రావడానికి కారణంగా భావిస్తున్న నీటి సమస్యను తీర్చడమే కాకుండా.రోగులకు పెన్షన్లు, ఉచితంగా డయాలసిస్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

పవన్ కు తప్పుడు సమాచారం అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు.ఓ సారి ఉద్దానంకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెక్ చేసుకోవాలని ట్వీట్ చేశారు.

అయితే పవన్ దీనిపై స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube