విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ కోడికత్తి కేసుపై విచారణ జరగనుంది.ఇందులో భాగంగా బాధితుడిగా ఉన్న సీఎం జగన్, ప్రత్యక్ష సాక్షి దినేశ్, జగన్ పీఏ కేఎన్ఆర్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం గత విచారణలో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కోడికత్తి దాడి కేసులో సాక్షిగా ఉన్న దినేశ్ గతంలో కేసు విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో ఇవాళ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.మరోవైపు బాధితునిగా ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది.