ఆధారాలు ఉంటే సీల్డ్ కవర్ లో పంపండి అంటూ బాబుకు డీజీపీ లేఖ!

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు లేఖ రాసినట్లు తెలుస్తుంది.చిత్తూరు జిల్లాకు చెందిన జడ్డి రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై వైసీపీ నేతలు దాడి చేశారు అంటూ నిన్న బాబు రాసిన లేఖకు సవాంగ్ కౌంటర్ లేఖ రాసినట్లు తెలుస్తుంది.

 Don't Write Open Letters, Dgp Tells Chandrababu Ap, Dgp, Gawtham Sawang, Chandra-TeluguStop.com

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వారు ఇలా మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలి అంటూ సూచించారు.వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా కు ఇలా లేఖలు విడుదల చేయడం అనేది సరికాదు అని సవాంగ్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి చర్యల వల్ల సమాజంలో లేనిపోని అపోహలు,అనుమానాలు తెలెత్తుతాయి అని సవాంగ్ అన్నారు.ఏవైనా ఆధారాలు ఉంటె సీల్డ్ కవర్ లో పంపాలని ఖచ్చితంగా పరిశీలిస్తామని డీజీపీ తెలిపారు.

చట్ట ప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని రామచంద్ర ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌ రెడ్డిని అరెస్టు చేశామని ఆయన స్పష్టం చేశారు.ఒక దారి విషయంలో ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య వివాదం చోటుచేసుకుంది అని, ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామ చంద్ర పై ప్రతాప్‌ రెడ్డి దాడి చేశారని డీజీపీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే రామచంద్ర పై దాడి చోటుచేసుకుంది తప్ప వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవావస్తమని డీజీపీ వివరించారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించామని డీజీపీ తెలిపారు.

దీనిపై మరింత విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube