ఈ విగ్రహాన్ని చూసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు.. విషయం తెలిస్తే దండం పెడతారు!

భారతదేశం లలితకళలకు నిలయం అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.వివిధ ప్రాంతాల్లో వున్న కొలువుదీరిన కళలే దీనికి ప్రామాణికం.

లళితకళల్లో శిల్పం ఒకటి.మనం ఎన్నో చోట్ల ఎన్నో రకాల శిల్పాలు(విగ్రహాలు) చూసుంటాం.

Don T Misunderstand This Statue ,Statue , Viral Latest , News Viral , Social Med

కానీ ఇలాంటి అరుదైన విగ్రహాన్ని మాత్రం బహుశా తొలిసారి చూసిన ఫీలింగ్ కలగక మానదు.ఎందుకంటే ఈ ఇదొక స్త్రీ యొక్క నగ్న రూప విగ్రహం.

అభ్యంతరకరమైన భంగిమలో తీర్చిదిద్దిన ఈ కళాఖండం పేరు యక్షి.కేరళలోని పాలక్కడ్‌ జిల్లా మలంపుఝా గార్డెన్స్‌లో ఉంది.ఇది రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రదేశం.

Advertisement

ఒక మహిళ వస్త్రాలు లేకుండా నేల మీద రెండు కాళ్లూ ముందుకు పెట్టి ఎడంగా తెరిచి కూర్చున్న చిత్రం చూస్తే గనుక మొదట ఒకింత నెగిటివ్ ఫీలింగ్ కలగకమానదు.అయితే దీన్ని రూపొందించిన కళాకారుడు మాటలు వింటే మాత్రం రెండు చేతులు జోడించి దండం పెడతారు.

ఈ స్టాచ్యూ హైట్‌ 30 అడుగులు.కాగా ఇది మన దేశంలోని ఎత్తైన దిగంబర స్త్రీ ప్రతిమల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

కోవెల బయట కొలువై ఉండటం ఈ దేవత ప్రతిరూపం ప్రత్యేకత.ఒక ఆడ మనిషిని అలా చూడాలని ఫిక్స్‌ అయితే తప్ప ఇందులో అశ్లీలం మచ్చుకైనా కనిపించదని చెబుతున్నాడు ఆ కళాకారుడు.

ఇక ఈ విగ్రహ రూపశిల్పి పేరు కనాయి కున్హిరామన్‌.భారతదేశంలో ఇప్పటివరకు సృష్టించబడిన అత్యుత్తమ కళాకృతుల్లో ఈ యక్షి ఒకటని ప్రతీతి.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

కనాయి కున్హిరామన్‌ 1969లో అనగా 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దీనికి తుది రూపమిచ్చాడు.ప్రస్తుతం ఈ ఆర్ట్‌ వర్క్‌ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేసే ఏర్పాట్లులో బిజీగా వున్నాడు.

Advertisement

దీనికి కాంస్యం పూత పూయడం ద్వారా ఈ కళాకృతి దృఢంగా ఉంటుందని, భవిష్యత్తులో చిన్న డ్యామేజీ కూడా కాకుండా ఉంటుందని చెబుతున్నాడు.సమాజంలోని సంప్రదాయవాదుల ప్రతికూల ఆలోచనా తీరులో, వాళ్లు స్త్రీలను చూసే చూపులో మార్పు తేవటం కోసమే దీన్ని సృష్టించానని చెప్పుకొస్తున్నారు.

తాజా వార్తలు