ఈ యాప్ మీ ఫోన్ లో ఉందా.. అయితే వెంటనే డిలీట్ చేయండి..!

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎట్రాక్టివ్ గా అనిపించే యాప్ ఏదైనా నోటిఫికేషన్ వస్తే చాలు ఓకే బటన్ నొక్కడం చాలా సింపుల్ అయ్యింది.అలాంటి యాప్స్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయడం వల్లే వచ్చే అనర్ధాలను ముందు కనిపెట్టడం చాలా కష్టం.

 Dont Download These Apps Beware Of System Update System Update Apps, Beware Of S-TeluguStop.com

ఇన్ స్టాల్ చేశాక మనకు తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్, డేటా మొత్తం హ్యాక్ అయ్యి నష్టం జరిగిందని గుర్తించాక కాని కనువిప్పు కలుగదు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ లలో సాఫ్ట్ వేర్ అప్డేట్, సిస్టెం అప్డేట్ అనే మాల్వేర్ యాప్ ఒకటి వస్తుంది.

మాములుగా అయితే ఆపరేటింగ్ సిస్టెం కు సంబందించిన అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ సిస్ టెం అప్డేషన్ జరుగుతుంది.

కొత్తగా ఈ సిస్టెం అప్డేట్ యాప్ ఒకటి యూజర్లను బుట్టలో వేయడానికి వచ్చింది.

అలాంటి యాప్ ఒకటి ఫోన్ లో ఒక్కసారి ఇన్ స్టాల్ చేస్తే ఇక డేటాతో పాటుగా అన్నిటిని హ్యాకర్స్ తమ చేతుల్లోకి తీసుకుని మిస్ యూజ్ చేస్తారు.ఆండ్రాయిడ్ సిస్టెం అప్డేట్ అనగానే స్మార్ట్ యూజర్లు ఈజీగా మోసపోయే అవకాశం ఉంటుంది.

ఈ యాప్ ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ కేటగిరిలోకి చేర్పించారు జింపీరియం సంస్థ.జింపీరియం సి.ఈ.ఓ శ్రీధర్ మిట్టల్ థర్ట్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుండా ఉంటే మంచిదని సూచించారు.ఓఎస్ అప్డేట్స్ అన్ని ఫోన్ లో అప్డేట్స్ సెక్షన్ లో ఉంటాయని వాటికోసం ప్రత్యేకంగా ఏ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube