ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఇలాంటి పనులు అస్సలు చేయవద్దు...లేదంటే చుక్కలు చూడాల్సొస్తుంది!

కరోనా పుణ్యమాని ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డారు.దాంతో ఇల్లే ఆఫీస్ అయింది.

 Don T Do This At All On An Office Laptop Or You Ll End Up With Dots , Office Lap-TeluguStop.com

ఈ క్రమంలో వివిధ కంపెనీలు వారి వర్క్ కోసం ల్యాప్‌టాప్‌ ఇంటికే పంపిస్తున్నాయి.అలాగే ఆన్లైన్ విద్య కోసమని స్టూడెంట్స్ కూడా వాటికి అలవాటు పడ్డారు.

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ల్యాప్‌టాప్‌ అనేది తప్పనిసరి అయిపోయింది.స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ అది వర్క్ చేయడానికి అనువుగా ఉండదు కనుక అనేకమంది ల్యాప్‌టాప్‌లోనే వర్క్ చేయడం జరుగుతోంది.

అయితే ఈ క్రమంలో అనేక అవమానీయ సంఘటనలు జరగడం బాధాకరం.

చాలా మంది వ్యక్తులు తమ ఆఫీస్ పనితోపాటు వ్యక్తిగత పనిని కూడా ఆఫీసు ల్యాప్‌టాప్‌లో చేస్తున్నారు.

అలా చేయడం పెద్ద తప్పిదమని చెప్పుకోవాలి.తెలియక చేసినా, తెలిసి చేసినా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే.ఆఫీస్ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే పరిణితిని కలిగి ఉండాలి.లేదంటే.మీ ఉద్యోగానికే ఎసరు తెస్తుంది.చాలామంది అదే ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో వేరే ఉద్యోగం కోసం వెతుకుతున్నారట.అలా అస్సలు చేయకండి.మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త!

Telugu Personal, Search, Ups-Latest News - Telugu

అలాగే మీ రెజ్యూమ్‌ని ఎక్కడికైనా పంపడం వంటి పనులను కూడా అస్సలు చేయకండి.వ్యక్తిగత డేటా, ఫైల్స్‌ను అయితే పొరపాటున కూడా అస్సలు సేవ్ చేయొద్దు.ఎందుకంటే దీని కారణంగా మీ వ్యక్తిగత విషయాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. చాటింగులు, మీటింగులు అస్సలే వద్దు.చాలా కంపెనీలు తమ స్వంత చాట్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంటాయి.అక్కడ వారు ఇతర ఉద్యోగులతో కనెక్ట్ అయి ఉంటారు.

కాబట్టి డెబ్బైపోతారు.అలాగే అభ్యంతరకరమైన కంటెంట్ కోసం వెతకొద్దు.

కొంతమంది ఆఫీసు ల్యాప్‌టాప్‌లలో పోర్న్ చూస్తుంటారు.ఇలాంటి పనులు ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఏమాత్రం చేయకూడదు.

ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube