అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ నేత, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దూసుకెళ్తున్నారు.రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం జరుగుతున్న పోరులో ఒక్కొక్కరుగా తన ప్రత్యర్ధులను మట్టికరిపిస్తూ, ప్రైమరీలలో విజయం సాధిస్తూ జీవోపీ నామినేషన్ వేపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా ఇదాహో, మిస్సౌరీ కాకస్‌లను( Idaho , Missouri caucuses ) ట్రంప్ గెలుచుకున్నారు.అలాగే మిచిగాన్‌లో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌లోనూ డెలిగేట్ హాల్‌ను స్వీప్ చేశారు.
ట్రంప్ శనివారం రాత్రి అత్యధిక మంది ప్రతినిధులను సంపాదించారు.భారత సంతికి చెందిన , ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీకి( Nikki Haley ) 24 మందితో పోలీస్తే అతని ప్రతినిధుల సంఖ్య 244కి చేరుకుంది.
ఒక అభ్యర్ధి రిపబ్లికన్ నామినేషన్‌ను కైవసం చేసుకోవడానికి 1215 మంది డెలిగేట్‌లు పొందాలి.
రిపబ్లికన్ క్యాలెండర్‌లోని తదుపరి ఈవెంట్ ఆదివారం కొలంబియా జిల్లాలో జరుగుతుంది.రెండు రోజుల తర్వాత సూపర్ ట్యూస్డే .16 రాష్ట్రాలు నవంబర్ ఎన్నికలకు ముందు అతిపెద్ద ఓటింగ్ డేగా ప్రైమరీలను నిర్వహిస్తారు.మిస్సౌరీ వేదికపై సేథ్ క్రిస్టెన్‌సన్ ( Seth Christensen ) నిలబడి హేలీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.కానీ దానికి స్పందన అంతంత మాత్రమే.బూన్ కౌంటీలో హాజరైన 263 మంది రిపబ్లికన్లలో హేలీ కేవలం 37 మందిని మాత్రమే గెలుచుకున్నారు.మిచిగన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లో జరిగిన వార్షిక సమావేశంలో 55 మంది జీవోపీ ప్రతినిధులలో 39 మందిని ట్రంప్ గెలుచుకున్నారు.
గత మంగళవారం జరిగిన మిచిగన్ ప్రైమరీలో హేలీ సాధించిన 27 శాతం ఓట్లతో పోలిస్తే ట్రంప్ 68 శాతం ఓట్లతో విజయం సాధించారు.
ఇకపోతే.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలపై జరుగుతున్న నేర పరిశోధనలో ప్రాసిక్యూషన్ నుంచి తనకు సంపూర్ణ మినహాయింపు (ఇమ్యూనిటీ) వుందని పేర్కొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిటిషన్‌ను విచారించనున్నట్లు బుధవారం యూఎస్ సుప్రీంకోర్ట్ ప్రకటించింది.ఈ నిర్ణయం 2024 ఎన్నికల తర్వాత విచారణను ఆలస్యం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డీసీ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి ఏప్రిల్ 22న మౌఖిక వాదనలను కోర్ట్ షెడ్యూల్ చేసింది.న్యాయస్థానం ఈ నెల ప్రారంభంలో ఒక తీర్పులో ట్రంప్ ఇమ్యూనిటీ హక్కును గట్టిగా ఖండించింది.