హత్యాయత్నం జరిగిన స్పాట్‌కి మరోసారి ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో కలిసి భారీ ర్యాలీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump)తన ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

తాజాగా తన రన్నింగ్ మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి) జేడీ వాన్స్‌, బిలియనీర్ ఎలాన్ మస్క్‌లతో కలిసి భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు.

అది కూడా తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా( Pennsylvania)లోని బట్లర్‌లో కావడం గమనార్హం.డెమొక్రాటిక్ అభ్యర్ధి కమల హారిస్, ఆమె రన్నింగ్‌ మెట్‌ టిమ్ వాల్జ్‌లకు చెక్ పెట్టడానికి, ప్రచారానికి కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ భావిస్తున్నారు.

ఈ ర్యాలీకి దాదాపు 10 వేల మంది హాజరవుతారని అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది.సోషల్ మీడియా కథనాలను బట్టి .బట్లర్‌లోని హోటళ్లు, మోటళ్లు, ఇతర వసతి గృహాలు రిపబ్లికన్ మద్ధతుదారులతో నిండిపోయాయట.పలు ప్రాంతాలకు చెందిన ట్రంప్ అభిమానులు కార్లతో ఇప్పటికే బట్లర్‌ చేరుకున్నారట.

హత్యాయత్నం జరిగిన రోజు తర్వాత బాధితులను కలుసుకునేందుకు బట్లర్‌కు రావాలని ట్రంప్ ఎదురుచూస్తున్నారని ఆయన ప్రచార ప్రతినిధి కరోలిన్ లీవిట్ అన్నారు.స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు ట్రంప్ ప్రసంగించనున్నారు.

Advertisement

కాగా.జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) ఏర్పాటు చేసిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్గొన్నారు.దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న 20 ఏళ్ల ఆగంతకుడు థామస్ మాథ్యూ క్రూక్స్‌( Thomas Matthew Crooks ) కాల్పులకు తెగబడ్డాడు.

కాల్పుల శబ్ధం వినిపించిన వెంటనే ట్రంప్ పోడియం కిందకి చేరి తనని తాను రక్షించుకున్నారు.వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనకు రక్షణ కవచంలా నిలిచారు.అప్పటికే బుల్లెట్ ట్రంప్ కుడి చెవి మీదుగా వెళ్లి గాయమైంది.

సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.దుండగుడిని మట్టుబెట్టాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?
Advertisement

తాజా వార్తలు