2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని చూస్తోన్న రిపబ్లిన్ నేత , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) వరుస షాకులు తగులుతున్నాయి.జనవరి 6 కేపిటల్ భవనంపై దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనపై కొలరాడో కోర్టు అనర్హత వేటు వేసింది.
దీనికి తోడు సవాలక్ష సివిల్ , క్రిమినల్ కేసులు వెంటాడుతున్నాయి.తాజా మరో కేసులో ప్రఖ్యాత వార్తాసంస్థ న్యూయార్క్ టైమ్స్( New York Times ) దాని ముగ్గురు రిపోర్టర్లకు దాదాపు $400K చెల్లించాలని ట్రంప్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్లు సుసాన్ క్రెయిగ్,( Susanne Craig ) డేవిడ్ బార్‌స్టో,( David Barstow ) రస్సెల్ బ్యూట్‌నర్‌లు( Russell Buettner ) దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది మేలో న్యాయమూర్తి రాబర్ట్ రీడ్ కొట్టివేశారు.పన్ను రికార్డులను పంచుకోవడం ద్వారా మునుపటి సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపించిన తన మేనకోడలిపై ట్రంప్ దావా మాత్రం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమస్యల సంక్లిష్టతతో పాటు కేసులోని ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే.
టైమ్స్ విలేకరులకు( Times Reporters ) ట్రంప్ చెల్లించాల్సిన 3,92,638 డాలర్ల లీగల్ ఫీజులు సహేతుకమైనవని రీడ్ చెప్పారు.జర్నలిస్టుల( Journalists ) నోరు మూయించేలా ఉద్దేశించిన పనికిమాలిన వ్యాజ్యాల నుంచి వారిని రక్షించే స్టేట్ ఎస్ఎల్ఏపీపీ వ్యతిరేక చట్టాన్ని కూడా న్యాయమూర్తి ప్రశంసించారు.జర్నలిస్టుల నోరు మూయించేందుకు న్యాయవ్యవస్ధను దుర్వినియోగం చేయాలనుకునేవారికి కోర్టు సందేశం పంపిందని అటార్నీ వ్యాఖ్యానించారు.
డొనాల్డ్ ట్రంప్ 2021లో టైమ్స్ విలేకరులపై దావా వేశారు.విలేకరులు మేరీ ట్రంప్‌ను( Mary Trump ) సమాచార సాధనంగా వెంబడించారని,
పన్ను రికార్డులను అందజేసేలా ఆమెను ఒప్పించారని దావాలో పేర్కొన్నారు.కుటుంబ పితామహుడైన ఫ్రెడ్ ట్రంప్ ఆస్తికి సంబంధించిన వివాదంలో ఆమె సంపాదించిన పత్రాలను బహిర్గతం చేయడానికి మేరీ ట్రంప్‌కు ఎలాంటి అధికారం లేదని విలేకరులకు తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు.టైమ్స్ కథనం ప్రకారం.
మాజీ అధ్యక్షుడు తన తండ్రి నుంచి పన్ను ఎగవేత పథకాలతో సహా కనీసం 413 మిలియన్ డాలర్లు అందుకున్నారు.మేరీ ట్రంప్ 2020లో ప్రచురించిన పుస్తకంలో పత్రాలకు మూలం అని ధృవీకరించారు.