పిల్లితో స్నేహం పెంచుకోవడానికి కుక్క తిప్పలు.. వీడియో చూస్తే నవ్వేనవ్వు..

పిల్లి మధ్య ఎంత వైరం ఉంటుందో కుక్క, పిల్లుల( Dogs, cats ) మధ్య కూడా అంతే శత్రుత్వం ఉంటుంది.ఇవి రెండూ కూడా ఎప్పటికీ కలిసి స్నేహం చేయవనే భావన చాలా మందిలో ఉంటుంది.

 Dog Flips To Make Friends With Cat Watch The Video And Laugh, Cat, Dog, Viral Ne-TeluguStop.com

ఎందుకంటే ఇవి ఎప్పుడూ పోట్లాడుతూ కనిపిస్తాయి.కానీ కొన్ని కుక్కలు పిల్లలతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతుంటాయి.

తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక కుక్క పిల్లి తో స్నేహం కోసం తెగ పాకులాడింది.దీనిని మొదటగా రెడిట్‌లో షేర్ చేశారు.

ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.

కోవు అనే కుక్క సింబా( Simba ) అనే పిల్లితో స్నేహం చేయడానికి ప్రయత్నించింది.దానికి సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేశారు ఓనర్.

ఆ వీడియోలో, స్మార్ట్ డాగ్ తన యజమాని పిల్లిని మచ్చిక చేయడానికి తీగలను ఎలా ఉపయోగించారో గమనించింది.దానితో స్నేహం చేయడానికి అదే వస్తువును ఉపయోగించింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు పిల్లి నేలపై పడుకోవడం, దాని ముందు కుక్క నిలబడి ఉండటం గమనించవచ్చు.తర్వాత కుక్క కొన్ని తీగలను తీసుకువెళ్లి పిల్లి ముందు వేలాడదీస్తుంది.మొదట్లో ఆసక్తి చూపని పిల్లి, చివరికి తీగలు, కుక్కతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది.అలా కుక్క ఈ ప్రయత్నంలో విజయం సాధించింది.”పిల్లితో స్నేహం చేయడానికి చాలా ప్రయత్నించాను” అని వీడియోకు క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్క ప్రయత్నాలను చూసి నవ్వుకుంటున్నారు మరికొందరు ఈ ముచ్చటైన దృశ్యాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు.

దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube