ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్( Smart phone ) వినియోగించని వారు చాలా అరుదు.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.
అయితే స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుంటే చాలా చిరాకుగా ఉంటుంది.ఎందుకంటే.
మనిషి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే దాదాపుగా సగానికి పైగా పనులు సులువుగా అయిపోతాయి.స్మార్ట్ ఫోన్ ఎందుకు స్లో అవుతుంది.
స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయితే ఫోన్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవడానికి ప్రధాన కారణం ఫోన్ స్టోరేజ్ ఫుల్( Phone Storage Full ) కావడమే.
దీంతో ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు.అంతేకాదు కనీసం ఫోటో లేదా వీడియో కూడా సేవ్ చేయలేరు.
కాబట్టి ఫోన్ లో స్టోరేజ్ నిండితే, అనవసరమైన వాటిని తొలగించాలి.
![Telugu App, Smart Phone, Speed, Technolgy-Technology Telugu Telugu App, Smart Phone, Speed, Technolgy-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/speed-anti-Virus-app-Phone-Storage-Full-smart-phone-smart-phone-Hanging-technolgy-technolgy-news.jpg)
ఉదాహరణకు OTT యాప్, కొన్ని అనవసరమైన సోషల్ మీడియా యాప్, గేమింగ్ యాప్స్, కొన్ని చిన్న పిల్లలకు సంబంధించిన యాప్స్ ఎక్కువ స్టోరేజ్ ని వినియోగిస్తాయి.వీటిలో అనవసరమైన వాటిని తొలగిస్తే చాలావరకు స్టోరేజ్ ఆదా చేసుకోవచ్చు.ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ యూజర్లు ఏ యాప్స్ ఎక్కువ స్టోరేజ్ ని తీసుకుంటుందో ఈ విధంగా తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ తెరచి, ప్రొఫైల్ చిహ్నం పై క్లిక్ చేయాలి.అక్కడ యాప్లు అండ్ పరికరాలను నిర్వహించు ఎంపికను సెలెక్ట్ చేయాలి.
![Telugu App, Smart Phone, Speed, Technolgy-Technology Telugu Telugu App, Smart Phone, Speed, Technolgy-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/speed-Phone-Storage-Full-smart-phone-Hanging-technolgy-technolgy-news.jpg)
అక్కడ ఏ యాప్ ఎక్కువ స్టోరేజ్ వినియోగిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది.స్మార్ట్ ఫోన్ లోని OS పై నుండి క్రిందికి ఆప్ డేట్ అవుతూనే ఉంటుంది.ప్రాంప్ట్ చేసినప్పుడు అప్ డేట్ చేస్తే స్మార్ట్ ఫోన్ వేగాన్ని ఉత్తమంగా ఉంచుతుంది.స్మార్ట్ ఫోన్ లో జంక్ ఫైల్స్ ఉండడం వల్ల ఫోన్ జీవితకాలం తగ్గిపోతుంది.
కాబట్టి యాంటీ- వైరస్ యాప్ తో మీ ఫోన్ లోని ఫైల్ లను తరచూ శుభ్రం చేసుకోవడంతో పాటు కనీసం వారంలో ఒకసారైనా స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ కి వెళ్లి క్యాచీ ను క్లీన్ చేసుకోవాలి.ఐఫోన్ వినియోగదారులు సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఐఫోన్ స్టోరేజ్ ను ఎంచుకుంటే యాప్ ల జాబితా కనిపిస్తుంది.ఈ యాప్ ఎక్కువ స్టోరేజ్ వినియోగిస్తుందో అక్కడ చూడవచ్చు.