తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొద్దిమంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ( Allu Arjun )ఒకరు ఈయన తన స్టైల్ తో కుర్రాళ్ల ల్లో మంచి జోష్ నింపుతూ అంచలంచలు గా ఎదుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిడ్డ అయిన అల్లు అర్హ( Allu Arha ) కూడా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ చిల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది…తన ముద్దు ముద్దు మాటలతో ఐదేళ్ల వయసులోనే మంచి పాపులరిటీని సంపాదించుకున్న అర్హ.శాకుంతలం మూవీతో చైల్ట్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది.
దేవ్ మోహన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రిన్స్ భారత పాత్రను పోషించింది.ఏప్రిల్ లో విడుదలైన శాకుంతలం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
కానీ, అర్హ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

తనదైన డైలాగ్ డెలివరీతో అర్హ ప్రేక్షకులను ఫిదా చేసింది.అయితే తాజాగా అర్హ పాపను మరో క్రేజీ ఆఫర్ వరించింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( ntr )లేటెస్ట్ మూవీ దేవర లో నటించే అద్భుత అవకాశాన్ని అర్హ కొట్టేసింది.
కొరటాల శివ ( Siva Koratala )డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ చేస్తున్న తొలి చిత్రమిది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ఎన్టీఆర్ తో తలపడే పవర్ ఫుల్ విలన్ పాత్రను పోసిస్తున్నాడు.
హైదరాబాద్ లో దేవర ( Devara )షూటింగ్ జరుగుతోంది.రీసెంట్ గానే ఐదో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసింది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.ఇందులో జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర ఉంటుందట.
ఆ పాత్ర కోసం కొరటాల శివ అల్లు అర్జున్ కూతురు అర్హను ఎంపిక చేశారట.

ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట.వచ్చే నెలలోనే అర్హ షూటింగ్ లో జాయిన్ కానుందని అంటున్నారు.దేవర సినిమాలో అర్హ స్క్రీన్ టైమ్ దాదాపు పది నిమిషాలు ఉంటుందట.
పది నిమిషాల పాత్ర కోసం బన్నీ తనయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది.ఎందుకంటే, అల్లు అర్హ ఏకంగా రూ.30 లక్షలు పుచ్చుకుంటుందట.అంటే నిమిషానికి రూ.3 లక్షలు సంపాదిస్తుందన్నమాట.ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మొత్తానికి అల్లు అర్హ బన్నీకి తగ్గ కూతురనిపించుకుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కనక హిట్ అయితే అర్హ రెమ్యూనరేషన్ భారీ స్థాయి లో పెరగడం పక్క…ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ రేంజ్ లో ఆర్హ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…
.