ప్రస్తుతం అమెరికా( America )లో కుక్కల పాలిట ఒక జబ్బు యమపాశంగా తయారైంది.ప్రాణాంతకమైన శ్వాసకోశ వ్యాధి ఇప్పుడు యూఎస్‌లో కుక్కలను వెంటాడుతోంది.10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో వందలాది కుక్కలు ఈ వ్యాధితో అనారోగ్యానికి గురయ్యాయి.దాంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యాధిని ఒరెగాన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ “ఎటిపికల్ కెనైన్ ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ డిసీజ్” అని పిలుస్తుంది, ఆగస్టు మధ్య నుంచి 200కి పైగా కేసులు నమోదయ్యాయి.కొలరాడో, ఇల్లినాయిస్, న్యూ హాంప్‌షైర్ వంటి ఇతర రాష్ట్రాల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి.

వ్యాధికి కారణం ఇంకా తెలియరాలేదు, అయితే ఇది వైరల్ అని తెలుస్తోంది.కానీ ఒరెగాన్ స్టేట్ వెటర్నరీ డాక్టర్ ర్యాన్ స్కోల్జ్ ప్రకారం, సాధారణ శ్వాసకోశ వైరస్ల కోసం టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ అని తేలింది.పాథాలజిస్ట్, డాక్టర్ డేవిడ్ బి.నీడిల్ తాజాగా మాట్లాడుతూ కుక్కలు ఎగువ శ్వాసకోశ సంక్రమణ లక్షణాలను చూపించాయని, అయితే వాటికి తెలిసిన శ్వాసకోశ వ్యాధులు లేవని తెలిపారు.

చాలా కుక్కలు వ్యాధి నుంచి బయటపడ్డాయి, అయితే కొన్ని కుక్కలు ఎక్కువ కాలం అనారోగ్యం తర్వాత తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన న్యుమోనియా బారిన పడ్డాయి.ఇతర బాక్టీరియా( Bacteria ) ద్వారా వచ్చే సెకండరీ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్ నీడిల్ చెప్పారు.సాధారణంగా కుక్కలలో నివసించే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు.యజమానులు కుక్కలను ఈ వ్యాధి నుంచి రక్షించడానికి కొన్ని టిప్స్ పాటించాలని వైద్యులు సూచించారు.
అదేంటంటే, తెలియని కుక్కల గుంపులతో తిప్పకూడదు.అనారోగ్యంతో ఉన్న కుక్కలకు పెంపుడు కుక్కలను( Pet dogs ) దూరంగా ఉంచాలి.
కుక్క అనారోగ్యంగా కనిపిస్తే, కుక్కను దగ్గరికి రానివ్వవద్దు.షేర్డ్ వాటర్ బౌల్స్ నుంచి కుక్కను తాగనివ్వవద్దు.
కుక్క అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉంచి, వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.







