మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఏ, బీ డ్రైవ్‌లు ఎందుకు ఉండవో తెలుసా?

అది ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ అయినా దానిని ఉపయోగిస్తున్నప్పుడు డ్రైవ్ తప్పనిసరిగా ఉంటుంది.

సి డ్రైవ్ మినహా, కంప్యూటర్‌లో ఇచ్చిన వివిధ డ్రైవ్‌లను యూజర్ తన సౌలభ్యం ప్రకారం ఉపయోగిస్తాడు.

అయితే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ సీ డ్రైవ్‌తోనే ఎందుకు ప్రారంభమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఏ లేదా బీ అని ఎందుకు పేరు పెట్టలేదు? దీని వెనుక గల కారణం ఏమిటో తెలుసా? డ్రైవ్‌కు ఏ లేదా బీ అని పేరు పెట్టకపోవడానికి కారణం ఫ్లాపీ డిస్క్.ప్రారంభ కంప్యూటర్లలో అంతర్గత స్టోరేజీ ఉండేదికాదు.దీంతో వినియోగదారు కంప్యూటర్‌లో దేనినీ సేవ్ చేయలేకపోయేవాడు.

Do You Know Why Your Laptop Or Computer Has A And B Drives , A And B Drives , L

కంప్యూటర్‌లో చేసిన పనిని సేవ్ చేయడానికి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్‌ను జోడించాల్సి వచ్చేది.దీనిని ఎ డ్రైవ్ అని పిలిచేవారు.

కాలక్రమేణా స్టోరేజ్‌ను మెరుగుపరచడానికి రెండు రకాల ఫ్లాపీ డిస్క్‌లు సృష్టించారు.మొదటిది 5 1/4 అంగుళాలు రెండవది 3 1/2 అంగుళాలు.

Advertisement

ఇవి కంప్యూటర్‌కు అనుసంధానమైనప్పుడు ఏ డ్రైవ్ మరియు బీ డ్రైవ్ అని పేరు పెట్టారు.అప్పటినుండి, కంప్యూటర్‌లో ఫ్లాపీ కోసం రెండు డ్రైవ్‌లు రిజర్వ్‌లో ఉంచారు.

ఫ్లాపీ అనేది ఒక రకమైన స్టోరేజీ.అందులో ఉండే మాగ్నెటిక్ స్టోరేజీలో డేటా స్టోర్ అవుతుంది.

దుమ్ము, గీతలు నుండి దీనికి రక్షణ అవసరం.అందుకే దీనిని కవర్లో ఉంచుతారు.

దాదాపు దశాబ్దంన్నర క్రితం ఫ్లాపీ కాలం ముగిసిపోయింది.ఫ్లాపీ డిస్క్ 1960లో ప్రవేశపెట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

మొదటి ఫ్లాపీ డిస్క్ 8 అంగుళాలు.తరువాత అది మరింత మెరుగుపడి దాని పరిమాణం తగ్గింది.

Advertisement

కాలక్రమేణా కంప్యూటర్‌లో స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు.ఆపరేటింగ్ సిస్టమ్ కోసం సీ డ్రైవ్ రూపొందించారు.

అదే సమయంలో ఇతర డ్రైవ్‌లను యూజర్ తన సౌలభ్యం ప్రకారం ఉపయోగించవచ్చు, అయితే సీ డ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మాత్రమే ఉపయోగిస్తారు.

తాజా వార్తలు