స్మార్ట్ ఫోన్( Smart phone ) లేనిదే ఇపుడు రోజు గడవట్లేదు.అవును, అది మనిషి జీవితంలో ఓ భాగమైపోవడం గమనార్హం.
ఇంకా చెప్పాలంటే ఫోన్ చేతిలో లేకుంటే జీవించడం కష్టంగా మారిపోతున్న పరిస్థితి.ఈ రోజుల్లో రోజంతా మన పక్కనే, మనతోనే ఉంటుందంటే అది ఖచ్చితంగా స్మార్ట్‌ఫోన్ అని చెప్పుకోకతప్పదు.
నిత్యావసర పనులు చేయడంతో పాటు వినోద సాధనంగా మొబైల్( Mobile ) మారిపోవడంతో మనిషి ఫోన్ తో సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే కెమెరాకోసం స్మార్ట్ ఫోన్ కొన్నవారు ఇక్కడ ఎంతమందో వున్నారు.

ఈ క్రమంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు( Smart phone companies ) ప్రత్యేకంగా కెమెరా ఫీచర్ పైన ఫోకస్ పెట్టి, నాణ్యమైన కెమెరాను తమ ఫోన్లలో ఫిక్స్ చేయడం మొదలు పెట్టారు.అయితే దాదాపుగా స్మార్ట్ ఫోన్‌లలో ఎడమవైపు మాత్రమే కెమెరా ఉండడం మనం గమనించవచ్చు.అది ఎడమ వైపు కాకుండా కుడివైపు ఎందుకు ఏర్పాటు చేయరు అనే అనుమానం మీలో చాలామందికి వచ్చేవుంటుంది.మొదట్లో వచ్చే ఫోన్లలో మధ్యలో కెమెరా ఇచ్చేవారు.తర్వాత క్రమంగా అన్ని కంపెనీలూ కెమెరాను మొబైల్ ఎడమవైపుకి మార్చాయి.మొదట్లో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్( iPhone ) ఎడమ వైపున కెమెరాను ఇవ్వడం ప్రారంభించింది.

దీని తరువాత, చాలా కంపెనీలు క్రమంగా అదే పద్ధతిని పాటించాయి.అయితే కెమెరాను ఎడమ వైపున ఉంచడానికి వేరే సైంటిఫిక్ కారణం ఉంది.ప్రపంచంలో చాలా మంది తమ ఎడమ చేతితో మొబైల్ వాడుతున్నారు.మొబైల్ వెనుక, ఎడమ వైపున అమర్చిన కెమెరాతో ఫోటోలు తీయడం లేదా వీడియోలు షూట్ చేయడం అనేది సులభం అవుతుంది.
అంతేకాకుండా మొబైల్‌ని తిప్పడం ద్వారా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోటో తీయవలసి వచ్చినప్పుడు, మొబైల్ కెమెరా పైకి అలాగే ఉంటుంది, దీని కారణంగా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కూడా ఫోటోను సులభంగా తీయవచ్చు.ఈ కారణాల వల్ల, కెమెరా మొబైల్‌కు ఎడమ వైపున ఇవ్వబడింది.