ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలు( Hindu temples ) మన భారత దేశంలో ఎన్నో ఉన్నాయి.
అలాగే ఎన్నో చరిత్రత్మక కట్టడాలు కూడా మన దేశంలో ఉన్నాయి.
అలాంటి ఒక చరిత్రత్మక దేవాలయం ఒడిస్సాలో వెలిసిన పూరి జగన్నాథ దేవాలయం.అలాగే శ్రీరాముని భక్తుడు ఆంజనేయస్వామి దేవాలయం( Anjaneyaswamy Temple ) కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉంది.
ఈ హనుమాన్ దేవాలయాన్ని దారియా మహావీర క్షేత్రంగా పిలుస్తారు.అయితే ఈ దేవాలయంలో హనుమంతున్నీ సంకెళ్లతో బంధించారు.
అసలు హనుమంతుని ఎందుకు బంధించారు.అసలు ఈ దేవాలయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీక్షేత్రంలో జగన్నాథుడు వెలసిన తర్వాత ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆ దేవాలయాన్ని సందర్శించాడు.అప్పుడు దేవాలయంలోకి ఊరంతా చేరి సముద్రుడి నుంచి రక్షించమని జగన్నాథుడిని వేడుకున్నారు.
ప్రజల బాధను చూసి జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యాడు.ఆ క్షేత్రానికి రక్షకుడిగా ఉండే హనుమంతున్ని విచారించారు.
అయితే హనుమంతుడు జగన్నాధుని( Jagannath ) అనుమతి లేకుండా అయోధ్య వెళ్లినట్టు తెలుసుకుంటాడు.అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుని కాళ్లు చేతులను తాడుతో కట్టేశాడట.అంతేకాకుండా ఇక ముందు అక్కడ నుండి ఎక్కడికి వెళ్లకుండా ఈ క్షేత్రంలోకి సముద్రుడు రాకుండా కాపలాకాయాలని చెప్పాడట.
అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడని భక్తులు చెబుతున్నారు.అప్పుడే ఆ స్వామివారికి దరియా మహావీర అని పేరు వచ్చింది.
దరియా అంటే సముద్రం అని అర్థం వస్తుంది.అప్పటి నుంచి వాయు పుత్రుడు పూరి నగరాన్ని రక్షిస్తున్నాడని అక్కడి భక్తులు నమ్ముతారు.అలాగే ఈ అంజనీ పుత్రున్నీ బేడి హనుమంతుడు అని కూడా పిలుస్తారు.
హనుమంతుడు కావాలాగా ఉన్నప్పటి నుంచి నగరానికి సముద్రం ఎంత దూరం ఉన్నా, తుఫాన్ వచ్చిన ఆ నగరంలోకి సముద్రపు నీరు రాదని అక్కడి భక్తులు చెబుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy