మీకు పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

పెళ్లి అంటే నూరేళ్ళ పంట.ముఖ్యంగా మన దేశంలో ప్రధానంగా హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.

 Do You Know Why Do You Wash Basikam In Weddings, Marriage , Bride, Groom, Reason, Latest News-TeluguStop.com

వివాహం విషయంలో పూజారులు లేదా పెద్దలు చెప్పినట్టుగా వధూవరులు అలంకరించుకుంటారు.ఇప్పుడు కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, టెక్నాలజీని పెళ్ళికి లింక్ చేసారు కాబట్టి కొన్ని పద్దతులు మారిపోయాయి అనుకోండి.

అయినా దాదాపుగా వివాహం విషయంలో పూర్వం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే మాదిరిగా వివాహాలు జరుగుతున్నాయి.వధూవరులు విదేశాల్లో సెటిల్ అయినప్పటికీ మన పూర్వకాలం పద్ధతినే వీలైనంతవరకు అనుసరిస్తున్నారు.

 Do You Know Why Do You Wash Basikam In Weddings, Marriage , Bride, Groom, Reason, Latest News -మీకు పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన సాంప్రదాయ వివాహంలో ముఖ్యమైన అంశం ఒకటుంది.అదే పెళ్లి కొడుక్కి, కూతురికి బాసికం కట్టడం.బాసికం కట్టడం వెనుక ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా అనేక లాభాలు ఉన్నాయని అంటున్నారు పెద్దలు.మానవ శరీరంలో మొత్తం 72 వేల నాడులు ఉంటాయి.

అందులో 14 నాడులు కీలకం.వీటి కారణంగానే మన శరీరం ఎల్లప్పుడూ ఉత్తేజంగా వుంటుందనే విషయం అందరికీ విదితమే.

ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్మ అనేవి అతి ముఖ్యమైనవిగా పెద్దలు చెప్తున్నారు.

సుషుమ్న నాడికి కుడి పక్కన సూర్యనాడి, ఎడమ పక్కన చంద్రనాడి అనేవి ఉంటాయట.

ఈ రెండూ నుదుట భాగంలో కలుసుకుంటాయని పెద్దలు చెప్తున్నారు.ఇక ఈ నాడుల కలయిక అర్థచంద్రాకారంలో ఉంటుంది.

వేదకాలంలో ఈ భాగాన్ని రుషులు ‘దివ్వచక్షువు’ అని పిలిచారు.వివాహసమయంలో దీనిపై ఇతరుల దృష్టి సోకకుండా బాసికాన్ని కట్టడం జరుగుతుంది.

ఎలాంటి ప్రమాదాలు, కష్టాలు రావని ఒక నమ్మకం.బాసికం అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, చతురస్త్రాకారంలోనే ఉంటుంది.

నుదుట భాగాన బ్రహ్మ కొలువుంటాని హిందువులు బలంగా నమ్ముతారు.ఇక బంధు మిత్రుల దిష్టి తగలకుండా ఉండటానికి కూడా బాసికం కడతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube