వైరల్: చీమలు పట్టిన జీడిపప్పును ఆరగించిన చిన్నోడు.. ఎందుకంటే..?

డ్రై ఫ్రూట్స్ లో కింగ్ జీడిపప్పు అని చెబుతూ వుంటారు.ఎందుకంటే అందులో ఎన్నో రకాల ఆరోగ్య కరమైన పోషక విలువలు ఉంటాయి.

 Viral: A Child Who Ate An Ant-infested Cashew. Viral Latest, News Viral Social,-TeluguStop.com

పైగా ఇవి మిగతావాటికంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.అందుకే వీటిని వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు.

మరికొందరు బాగా ఏపుకొని మసాలా అద్దుకుని మరీ ఆరగిస్తారు.అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఎక్కువ.

ఇవి కొనాలంటే కాస్త డబ్బులు దండిగా ఉండాలి మరి.అయితే వీటికున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ నట్స్‌కు చీమల బెడద ఎక్కువ.ఎక్కడ దాచినా చీమలు వీటిని తినేస్తుంటాయి.అందుకే కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి.

అలాగే వీటిని దాచేటప్పుడు సరైన ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి.ఇక తినేటప్పుడు ఓసారి పరిశీలించిన తర్వాతే తినాలి.

లేదంటే ఈ వీడియోలో జరిగిన తంతే జరుగుతుంది.విషయం ఏమంటే, చీమలు పట్టిన జీడిపప్పును తింటే ఏమవుతుందని అనుకున్నారేమో వారు.

అలా చీమలు పట్టిన జీడిపప్పుని తిన్న యువకులు ఆ తర్వాత వాంతులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇందులో ఓ ప్యాకెట్‌లో నిల్వచేసిన జీడిపప్పును పోటాపోటీగా తినడం ప్రారంభించారు కొందరు యువకులు.అయితే ఆ ప్యాకెట్‌ సగం ఖాళీ అయ్యేవరకు కూడా అందులో చీమలున్నాయనే విషయం వారు గ్రహించలేదు.

చివరకు నట్స్‌లో చీమలు కూడా ఉన్నాయని తెలుసుకుని షాక్‌ అయ్యారు.‘ప్యాకెట్‌ లోపల ఏముందో చూసుకోకుండానే జీడిపప్పును ఒక నిమిషం పాటు తిన్నాం’ అని ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు యువకులు.అందులో ఒకరు ఏకంగా వాంతులు చేసుకుంటూ కనిపించడం మనం చూడవచ్చును.నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 10 మిలియన్ల మందికి పైగా వీక్షించడం కొసమెరుపు.అలాగే 3.56వేల మంది లైక్‌లు కొట్టగా, వేలాది మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘చీమల్లో మంచి ప్రొటీన్‌ ఉంటుంది.సో నో ప్రాబ్లం!’ అని ఒకరు కామెంట్ చేయడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube