సినిమా ఇండస్ట్రీ అంటే బయట నుంచి చూసే వాళ్లకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికి కూడా ఫైనాన్షియల్ గా ఏ ఇబ్బందులు ఉండవు అని సామాన్య జనాలు అనుకుంటూ ఉంటారు.
సినిమాల్లో నటించే వాళ్లకి ఎక్కువ కష్టాలు ఉంటాయని విషయం చాలామందికి తెలియదు.నిజానికి హీరోగా గానీ లేదంటే ఆర్టిస్టుగా గానీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే చాలా కష్టం.
రోజుకు కొన్ని వందల మంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.

చాలామంది ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నారు.ఇక ఇలాంటి క్రమంలో వచ్చిన వాళ్లు మళ్లీ వెనక్కి వెళ్లిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లి శ్రీకాంత్( Srikanth ) కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు.అయితే ఆయనకి కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఫైనాన్షియల్ గా కూడా కొంతవరకు సపోర్ట్ చేశారనే వార్తలు హల్చల్ చేశాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఫైనాన్షియల్ గా అలాగే మోరల్ గా శ్రీకాంత్ కి సపోర్ట్ చేయడం వల్లే తను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు అంటూ చాలా సందర్భాల్లో శ్రీకాంత్ చెప్పాడు.చాలామంది హీరోలు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారే అందువల్లే ఇండస్ట్రీకి రావాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు.
ఇక ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళ కెరియర్ ని సెటిల్ చేసుకునే పనిలో పడతారు.

ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ( film industry )సక్సెస్ కంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇండస్ట్రీని అవాయిడ్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు మరి వాళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొని ఎవరు సక్సెస్ అవుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది…








