Kamal Haasan : కమల్ హాసన్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో కమల్ హాసన్( Kamal Haasan ) ఒకరు.

ఆయన చేసిన సినిమాలు వరుసగా తెలుగులో కూడా డబ్ అవుతూ ఇక్కడ కూడా మంచి విజయాలను సాధించాయి.

ఇక ఆయన తెలుగులో కూడా స్ట్రైయిట్ గా చాలా సినిమాలను చేశాడు.అందులో ముఖ్యంగా కే విశ్వనాథ్( K Vishwanath ) డైరెక్షన్ లో చేసిన సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించటమే కాకుండా, నటనపరంగా ఆయన్ని తారా స్థాయిలో నిలిపాయనే చెప్పాలి.

ఇక ఆయన చేసిన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని అలరించడమే కాకుండా కమలహాసన్ సినిమాలు అంటే ఒక ఆర్ట్ కి సంబంధించిన సినిమాలుగా ఉంటాయి.లేదంటే ఒక కొత్త జానర్ లో ఉంటుంది అనే ఒక నమ్మకం అయితే ప్రేక్షకుల్లో సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే కమలహాసన్ కి తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరు అని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.

అయితే అందులో భాగంగానే కమలహాసన్ కి ఫేవరెట్ హీరో ఎవరు అంటే సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) అని తెలుస్తుంది.ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ చాలా వైవిధ్యమైన పాత్రలని అలవోకగా పోషించాడు

Advertisement

కాబట్టి అలాంటి నటుడిని ఇండియాలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అందువల్లే ఆయనంటే నాకు చాలా ఇష్టమని కమలహాసన్ తన సన్నిహిత వర్గాల దగ్గర ఎప్పుడు చెబుతూ ఉంటాడట.దీనివల్లే కమలహాసన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్ గా సినిమాలు చేయాలని, ఇండస్ట్రీలో భాగమవ్వాలని తను ఎప్పుడు కోరుకునే వాడట.ఇక తను అనుకున్నట్టుగానే తనకు తొందరగానే తెలుగు సినిమాల్లో చేసే అవకాశాలు వచ్చాయి.

అందువల్లే ఆయన తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించాడు.ఇక రీసెంట్ గా విక్రమ్ సినిమాతో( Vikram Movie ) తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఆయన భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు