తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘చిరుత ‘ (Chitutha) సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan)…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక రీసెంట్ గా ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాతో కొంతవరకు డీలాపడినప్పటికీ ఇప్పుడు రాబోతున్న బుచ్చిబాబు సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి ఒక ఇద్దరు నటులంటే చాలా ఇష్టమట.
అందులో మొదటగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సూర్య (Surya) అంటే అమితమైన ఇష్టం.ఆయన నటనతో మెప్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను చేయడంలో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.
కాబట్టే రామ్ చరణ్ కి సూర్య అంటే అమితమైన ఇష్టమట… ఇక తన గజినీ (Gajini) సినిమా చూసినప్పటి నుంచి అంత పశానెట్ యాక్టర్ ని నేను ఎక్కడా చూడలేదు అందువల్లే అతనికి అభిమానిగా మారిపోయాను అంటూ రామ్ చరణ్ కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా సూర్య చేసే ప్రతి పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

కాబట్టి ఆయన్ని ఇష్టపడే హీరోలు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇతనితో పాటుగా మలయాళం స్టార్ హీరో అయిన ‘మోహన్ లాల్ ‘ (Mohan Lal) అంటే కూడా రామ్ చరణ్ కి చాలా ఇష్టమట.ఆయన కంప్లీట్ యాక్టర్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఏ పాత్రలో అయినా జీవిస్తూ ఆ పాత్ర యొక్క ఇంపార్టెన్స్ ని పెంచుతూ ఉంటాడు.

అందువల్లే రామ్ చరణ్ కి మోహన్ లాల్ అంటే కూడా చాలా ఇష్టమట…మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు.మరి ఫ్యూచర్లో మోహన్ లాల్ రామ్ చరణ్ (Mohanlal, Ram Charan)కాంబినేషన్ లో ఒక అదిరిపోయే సినిమా కూడా రాబోతుంది అంటూ కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.







