ప్రవాసుల దృష్టిలో అత్యంత చెత్త దేశం ఏదో తెలుసా...!!!

ప్రపంచ నలుమూలల నుంచీ ఎంతో మంది ఇతర దేశాలకు వలసలు వెళ్తుంటారు.తమ దేశంలో కంటే కూడా మిగిలిన కొన్ని దేశాలలో జీతభత్య మరియు పని సమయాల్లో భారీ వ్యత్యాసం ఉండటం వలన ఎంతో మంది ఆయా దేశాలకు వలసలు వెళ్తుంటారు.

 Do You Know Which Country Is The Worst In The Eyes Of Expats , Dubai, Kuwait, A-TeluguStop.com

ఇలా ప్రతీ ఏటా ఒక్క భారత దేశం నుంచీ ఇతర దేశాలకు వలస వెళ్ళే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.వీరిలో ప్రవాస కార్మికులుగా దుబాయ్ దేశాలకు వెళ్ళే వారి సంఖ్య సగానికి పైనే ఉంటుందని అంచనా.

అయితే ఎంతో మంది ప్రవాసులు తాము వలస వెళ్ళిన దేశాల పరిస్థితులకు తగ్గట్టుగా ఇమిడి పోగా కొందరు మాత్రం అక్కడి లైఫ్ స్టైల్ ఏ మాత్రం నచ్చక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు…ఈ నేపధ్యంలో.

ఇంటర్ నేషన్స్ -22 అనే సంస్థ ప్రవాసులకు ఎలాంటి దేశం నచ్చుతుంది, ఏ దేశాలు నచ్చవు అంటూ ఓ సర్వే చేపట్టారు.

ఈ సర్వేలో మెజారిటీ ప్రవాసులు మాత్రం ఓ దేశం మాత్రం తమకు అస్సలు నచ్చలేదని, అలాంటి చెత్త దేశాన్ని తాము అసలు చూడలేదని తేల్చి చెప్పేశారు.ఇంతకీ ప్రవాసులు అంతగా ఇష్టపడని ఆ దేశం ఏంటో తెలుసా అరబ్బు దేశమైన కువైట్.

ఇంటర్ నేషన్ విడుదల చేసిన ఈ సర్వే తాలూకు విషయాలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి.ప్రవాసులు కువైట్ లో లైఫ్ స్టైల్ బాగోదని మాత్రమే కాదు అసలు కువైట్ ను ఏ విషయంలో పోల్చుకున్నా సరే ప్రవాసులకు ఏ మాత్రం నచ్చలేదట.

గల్ఫ్ దేశాలలో యూఏఈ అత్యంత భద్రమైన, లైఫ్ స్టైల్ బాగుండే ప్రదేశమని ప్రవాసులు తెలిపారట.తాము కువైట్ లో స్వేచ్చగా బ్రతకలేమని, తమ భావాలని వ్యక్తపరచాలని అనుకున్నా స్వేచ్చగా చెప్పలేమని ఈ సర్వేలో ప్రవాసులు తెలిపారట.

సుమారు 60 శాతం మంది కువైట్ లోని ప్రవాసులు ఈ విషయాన్ని వెల్లడించారట.అంతేకాదు ఇక్కడ ఏళ్ళ తరబడి పని చేస్తున్న ప్రవాసులను సైతం కువైటైజేషన్ పేరుతో దేశం నుంచీ తరిమేయడాన్ని ప్రవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube