700 సంవత్సరాలుగా వెలుగుతున్న.. అఖండ జ్యోతి ఎక్కడో తెలుసా..?

మన భారతదేశంలో ఎన్నో పురాతన పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.

ఈ పుణ్య క్షేత్రాలకు ఎన్నో వేల మంది భక్తులు ప్రతి రోజు తరలి వచ్చి భగవంతున్ని దర్శించుకుంటూ ఉంటారు.

అలాగే ఇంకా చాలా మంది భక్తులు భగవంతునికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు భగవంతుని వద్ద తల నీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.

అలాగే మన దేశంలో ఉన్న పురాతనమైన దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం( Telangana State ) లో మహిమానిత్వ క్షేత్రం ఉంది.

ఈ పుణ్య క్షేత్రంలో ఏడు వందల సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండ దీపం గురించి చాలా మందికి తెలియదు.

Advertisement

ఆ దీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరి సిల్ల జిల్లా( Rajanna Sircilla ) గంభీరావు పేట మండలం కేంద్రంలోని శ్రీ సీతా రామ స్వామి దేవాలయం నిర్మించే సమయంలో కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు నంద దీపాన్ని వెలిగించాడని పురాణాలలో ఉంది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందని దేవాలయ చరిత్ర చెబుతోంది.

ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తు శకం 1314 ప్రాంతంలో సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం కాకతీయ రాజుల కాలంలో కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు( Prataparudra Ruler ) ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు పూజారులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సీతా రామ స్వామి దేవాలయం ఆవరణలో 16 రాతి స్తంభాలతో కూడిన కళ్యాణ మండపం, 16 స్తంభాలతో కూడిన ప్రధాన మండపం కలిగి ఉండడం ఈ దేవాలయ విశిష్టత అని భక్తులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే 700 ఏళ్లుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండడం ఈ ఆలయ మరో ప్రత్యేకత అని స్థానిక భక్తులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, ఆదివారం2024
Advertisement
" autoplay>

తాజా వార్తలు