అక్షయ తృతీయ నాడు ఏ సమయంలో బంగారం కొనుగోలు చేయాలో తెలుసా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్ట స్థానం ఉంది.అయితే ఈ పండుగ వైశాఖమాసంలోని శుక్లపక్షం మూడవ రోజున జరుపుకుంటారు.

అయితే హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి( Goddess Lakshmi )ని పూజించడంతో పాటు బంగారం కొనుగోలు చేస్తే మంచిదని అందరు భావిస్తారు.

ఈ విధంగా చేస్తే ఏడాది పాటు అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు.

అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ 22 ఏప్రిల్ నాడు వచ్చింది.దీంతో అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఏ సమయానికి బంగారం కొనుగోలు చేయాలి? అన్నది ఎప్పుడో తెలుసుకుందాం.అక్షయ తృతీయ( Akshaya Tritiya ) శుభ సమయం.

Advertisement

అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నారాయణుని ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది.అయితే పంచాంగం ప్రకారం కలశ పూజ( Kalasa Pooja )కు అనుకూలమైన సమయం అక్షయ తృతీయ నాడు ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది.

ఇలా పూజ సమయం మొత్తం నాలుగు గంటల 31 నిమిషాల పాటు ఉంటుంది.ఈ సమయంలోనే బంగారు కొనుగోలు చేయడం కూడా చాలా మేలు జరుగుతుంది.ఇలాంటి సమయాల్లో ఆడవాళ్లు బయటకు వెళ్లి బంగారం కోలుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది.

ఎందుకంటే ఈ సమయాన్ని శుభ సమయంగా సూచించబడింది.

హిందూమత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవితో పాటు విష్ణువు, కృష్ణుడు, గణేషుడి( Ganesha )ని కూడా పూజించడం చాలా ప్రయోజనకరం.ఇలా చేయడం వలన మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది.అక్షయ తృతీయ నాడు పూజలు చేయడం కూడా చాలా ముఖ్యం.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024

అదేవిధంగా ఆస్తికి సంబంధించిన పనులు చేయడం, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలు కూడా ఈరోజున చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు