ఓనం పండుగ ఎప్పుడు.. ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే కేరళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓనం పండుగ ఆదివారం మొదలు అయింది.

తొలి రోజున అత్తమ్‌తో మొదలై పదో రోజున తిరుఓనమ్‌తో ముగిసే ఈ పండుగ ప్రాముఖ్యత, శుభ ముహూర్తం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ( Kerala )లో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనం పండుగ ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంతో బాగా జరుపుకుంటాము.కేరళలో అంతే సందడిగా ఓనం పండుగను జరుపుకుంటారు.

రైతులు పండించిన పంట కోతకు రావడంతో ఆనందపడుతూ చేసుకునే పండుగ కూడా ఇదే.

Do You Know When And How Many Days The Onam Festival Is Celebrated , Onam Fe

పురాణాల ప్రకారం పది రోజుల ఓనం పండుగను గొప్ప మహారాజు అయిన మహాబలిని ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు.ఓనం సందర్భంగా ఆ గొప్ప రాజుకు చెందిన ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ళ నమ్మకం.ఇంకా చెప్పాలంటే ఓనం వేడుకలలో భాగంగా తొలి రోజును అతమ్‌గా చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు.

Advertisement
Do You Know When And How Many Days The Onam Festival Is Celebrated? , Onam Fe

ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు.ఈ సంవత్సరం ఆగస్టు 20న ఓనం పండుగను అతమ్‌ తో ప్రారంభించి ఆగస్టు 31వ తేదీన తిరు ఓనం వేడుకలను( Onam festival ) జరుపుకోనున్నారు.

Do You Know When And How Many Days The Onam Festival Is Celebrated , Onam Fe

అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వలస వెళ్లినవారు సైతం ఓనమ్ పండుగ సమయంలో సొంత గ్రామాలకు చేరుకుంటారు.అందుకే మలయాళీలకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం.అంతేకాకుండా ఈ సమయంలోనే పడవ పందాలు కూడా జరుగుతాయి.

ఈ పండుగ మలయాళీలతో పాటు అన్ని మతాలకు చెందిన వారు జరుపుకుంటారు.పది రోజుల ఈ పండుగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు.

ఈ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు 10 రోజులపాటు వారసత్వంగా వచ్చిన వారి గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించేలా, అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు.అలాగే 1961 లో ఈ పండుగను కేరళ జాతీయ పండుగగా గుర్తించారు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..
Advertisement

తాజా వార్తలు